ఆడవాళ్ళ బట్టలు ఫ్రీగా ఉతుకు,- జడ్జి తీర్పు.

    0
    660

    పురాణాల్లోనో , కధల్లోనో మనం చూసే శిక్షలు వింతగా , విచిత్రంగా ఉంటాయి.. అయితే అలాంటి శిక్షనే ఇప్పుడు మనదేశంలో జడ్జి ఒకడికి వేసాడు.. ఒక మహిళను అవమానించిన కేసులో లాలన్ కుమార్ అను 20 ఏళ్ళ యువకుడికి బీహార్ ,మధుబన్ జిల్లా జజాన్పూర్ కోర్టు భలే శిక్ష విధించింది. రేప్ కేసులో నేరానికి జైల్లో ఉన్న అతడికి బెయిల్ ఇచ్చే ముందు జడ్జి లాలన్ కుమార్ కు కొన్ని షరతులు విధించాడు.

    లాలన్ కుమార్ గ్రామంలోని 2 వేలమంది మహిళల బట్టలను ప్రతినెలా ఉతికి , ఇస్త్రీ చేసి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇవ్వాలని ఆదేశించారు. ఇవన్నీ ఉచితంగానే చెయ్యాలని కూడా ఆదేశించారు. ప్రతినెలా గ్రామ సర్పంచ్ , కార్యదర్శి లాలన్ కుమార్ కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నాడని ఇచ్చిన సర్టిఫికెట్ ను కోర్టుకు సమర్పించాలని కూడా చెప్పారు. ఆరు నెలలపాటు లాలన్ కుమార్ ఇలాగే చెయ్యాలని ఆర్డర్ వేశారు. నిందితుడికి బెయిల్ ఇచ్చేముందు , జడ్జి అతడు ఏమిచేస్తుంటాడని అడిగారు. లాండ్రీ ఉందని చెప్పడంతో , ఇలాంటి వింత శిక్ష వేశారు..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.