ఫేస్ బుక్ పోస్టుకు సౌదీ జైల్లో 604 రోజులు..

    0
    635

    ఫేక్ ఐడితో పెట్టిన ఫేస్ బుక్ పోస్టుకు , కర్ణాటక ఉడిపికి చెందిన ఓ ఉద్యోగి సౌదీ జైల్లో 604 రోజులు జైల్లో ఉన్నాడు.. మన దేశంలో పోలీసు ఈ విషయం చెప్పకుండా ఉంటే , రాజు ధిక్కారానికి అతడికి మరణశిక్ష లేదా యావజ్జేవ శిక్ష పడిఉండేది.. దీని వివరాలిలావున్నాయి. హరీష్ అనే యువకుడు సౌదీలో ఎసి టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. మనదేశంలో ప్రవేశపెట్టిన ఎన్ ఆర్ సి కి అనుకూలంగా తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అక్కడ యజమాని మందలించడంతో దాన్ని తీసేసి , తన ఫేస్ బుక్ అకౌంట్ కూడా తీసేసాడు. అయితే సౌదీలో హరీష్ , ఎన్ ఆర్ సి కి మద్దతుగా పోస్టింగ్ పెట్టాడని తెలిసి , ముద్ బిద్రీకి చెందిన అబ్దుల్ హయుజ్ , అబ్దుల్ తయుజ్ అనే ఇద్దరు అన్నదమ్ములు , హరీష్ పేరుతో ఫేక్ ఐడితో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి , సౌదీ రాజును నిందిస్తూ పోస్టింగ్ పెట్టారు.

    దీంతో సౌదీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రాజద్రోహం కింద కేసుపెట్టారు. ఈ విషయం తెలిసి , ఉడిపిలోనే ఉన్న హరీష్ భార్య సుమన ఇక్కడ కేసుపెట్టింది. పోలీసులు విచారణచేసి , అబ్దుల్ హయుజ్ , అబ్దుల్ తయుజ్లను అరెస్ట్ చేసి , ఈ విషయాన్ని సౌదీ అధికారులకు తెలిపారు.. వాళ్ళ విచారణలో హరీష్ అమాయకుడని తేలడంతో 604 రోజుల తర్వాత వదిలేశారు,.సౌదీ జైలు నుంచి మనదేశానికి వచ్చిన హరీష్ కి భార్య , బిడ్డలు కన్నీటితో స్వాగతం చెప్పారు..

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..