ఆ సదస్సుకు అరగంటకో విమానం వాలిపోతుంది.

    0
    6535

    సినిమా హాల్ లో పార్కింగ్ లో మనం బైక్ లు, కార్లు పెట్టినట్టు.. అక్కడ విమానాలు పార్కింగ్ చేస్తున్నారు. అరగంటకో విమానం, వాలిపోతుంది. ఇదేదో విమానాశ్రయం కూడా కాదు. అదొక లోయ, ఆ లోయలో జరిగేది ప్రపంచ కోటీశ్వరుల సదస్సు. అలెన్ అండ్ కంపెనీ, అమెరికాలోని సన్ వ్యాలీలో ఈ ప్రపంచ కోటీశ్వరుల సదస్సు జరుపుతోంది. భార్యలతో కలసి ప్రపంచం మొత్తమ్మీద 1500 మంది కోటీశ్వరులు ఈ సదస్సుకి వస్తున్నారు. దాదాపు 300 ప్రైవేటు విమానాలు అక్కడ దిగుతాయి.

    దట్టమైన అడవిలో సన్ వ్యాలీ రిసార్ట్స్ ఉన్నాయి. అలెన్ అండ్ కంపెనీ అనేది, ప్రపంచంలో ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే సంస్థ. ప్రతి ఏడాదీ అలెన్ అండ్ కంపెనీ ప్రపంచ కోటీశ్వరులతో ఇలాంటి సదస్సులు నిర్వహిస్తుంది. ఈ సదస్సుకి హాజరయ్యే ప్రతి కోటీశ్వరుడు మూడు రోజుల ముందు కొవిడ్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ సదస్సుకి పిల్లల్ని అనుమతించరు. ఈ సదస్సు జరిగే ప్రాంతంలో ఆరోగ్యపరమైన విషయాలను, ప్రపంచ ప్రసిద్ధ సంస్థ మేయో క్లినిక్ డాక్టర్లు పర్యవేక్షిస్తారు. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్.. వ్యాక్సిన్లు కాక ఇతర వ్యాక్సిన్లు వేయించుకున్నవారెవరైనా మళ్లీ అక్కడ టెస్ట్ లు చేయించుకోవాల్సిందే.

    ఇదాహో అనే ప్రాంతంలో ఈ సదస్సు జరుగుతోంది. దీనికి సాఫ్ట్ వేర్, సినిమా, మీడియా, తదితర రంగాలకు చెందిన కుబేరులు వస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ , యాపిల్ టిమ్ కుక్, ఫేస్ బుక్ జుకెర్ బర్గ్, గూగుల్ నుంచి సత్య నాదెళ్ల.. ఇలా అన్ని ప్రముఖ కంపెనీల చైర్మన్ లు, సీఈఓలు వస్తారు. వాల్ మార్ట్ సీఈఓ వారన్ బఫెట్, ఆడమ్ సిల్వర్, రోజర్ గుడ్ విల్.. వంటివారు కూడా హాజరవుతారు.

    ఇక్కడకు వచ్చే ప్రతి కోటీశ్వరుడికి సొంత విమానం ఉంటుంది. అందుకనే వారి భద్రత, రక్షణ దృష్ట్యా ఇదాహో ప్రాంతంలోని అతి పెద్ద లోయలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. గతేడాది కరోనా ఉధృతి కారణంగా ఇది రద్దయింది. ఇన్వెస్ట్ మెంట్ షేరింగ్, ప్రపంచ మార్కెట్ పరిస్థితులు తదితర విషయాలపై ఈ సదస్సులో అధ్యయనం చేస్తారు. సదస్సు తర్వాత టెన్నిస్, గోల్ఫ్, పర్వతారోహణ, ర్యాఫ్టింగ్, సాల్మన్ నదిలో జల క్రీడలు ఇలాంటివి కూడా ఉంటాయి.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.