ఐఏఎస్ ని చంపేస్తామని బెదిరించిన మాఫియా

  0
  507

  కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ సిలిండర్ల అక్రమాలపై ఉక్కుపాదం మోపిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు తన బతుకే ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కుటుంబానికి ప్రాణ భయం ఉందని, ఏ క్షణంలో అయినా తనను, తన కుటుంబాన్ని చంపేస్తారని ఆందోళనపడుతున్నారు. ఈ యువ ఐఏఎస్ ఆఫీసర్ పేరు లోకేష్ జంగిడ్. మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలపై ఆయన తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ల సరఫరాలో కూడా పెద్ద కుంభకోణం జరిగింది. దాన్ని కూడా అడ్డుకున్నాడు. దీంతో 27ఏళ్ల ఈ యువ ఐఏఎస్ అధికారిని ఆఘమేఘాలమీద బదిలీ చేసేశారు.

  జాయింట్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న 42రోజుల లోపే ఆయన్ను రాజ్ శిక్ష కేంద్ర ఆఫీసర్ గా ఒక పనికిమాలిన పోస్ట్ కి బదిలీ చేశారు. ఐఏఎస్ అధికారిగా ఆయన ఉద్యోగంలో చేరిన నాలుగేళ్లలో ఇప్పటికి 8 సార్లు బదిలీ చేశారు. చివరకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, సిలిండర్ల కుంభకోణాన్ని వెలికి తీశారు. అయితే దీని వెనకున్న మాఫియా ఆయన్ను చంపేస్తానంటూ ఫోన్లు చేయడంతో, గత రాత్రి మధ్యప్రదేశ్ డీజీపీకి లేఖ రాశారు. అధికారంలో ఉన్న పెద్దలు తనను 6 నెలలు సెలవుమీద వెళ్లిపొమ్మని ఆదేశించారని, లేకపోతే నువ్వు నీ కుటుంబం ఇబ్బందులు పడతారని బెదిరించారని చెబుతున్నారు.

  కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా ఈ యువ ఐఏఎస్ అధికారికి పోలీసు రక్షణ ఏర్పాటు చేయడంలో ఎందుకు వెనకాడుతున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అవినీతిని బయటకు తీసి, అక్రమాలను ప్రశ్నిస్తే, ఇలా చేస్తే ఎలాగని ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో సాక్షాత్తూ మధ్యప్రదేశ్ వైద్య శాఖ మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. కొంతమంది అధికారులు కూడా ఈ కుంభకోణానికి సహకరించినట్టు వదంతులున్నాయి.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..