పోలీసు బావ డ్యూటీ చేస్తున్న బావమరిది..

  0
  47814

  దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులే తమలో దొంగ పోలీసుల్ని పట్టుకోలేక ఇప్పుడు తెలుసుకుని తేల కళ్లేశారు. అనిల్ కుమార్ అనే ఓ కానిస్టేబుల్ తనకు బదులుగా తన బావమరిది అనిల్ సోని ని కానిస్టేబుల్ గా పంపించాడు. అతడే గత 9ఏళ్లుగా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి వద్దే ఎస్ఎల్ఆర్ గన్, పిస్టల్ ఉన్నాయి. మొదట 2011లో ఉత్తర ప్రదేశ్ రాయ్ బరేలిలో కానిస్టేబుల్ గా బాధ్యతలు తీసుకున్నాడు అనిల్.

  ఆ తర్వతా ఏడాదికి అతడ్ని మొరాదాబాద్ కి ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడే అనిల్ కుమార్ కి ఓ ఆలోచన వచ్చింది. ఖాళీగా ఉన్న తన బావమరిదిని కానిస్టేబుల్ గా పంపిస్తే ఎలా ఉంటుందని భావించి, తన ట్రాన్స్ ఫర్ లెటర్ ని అతనికి ఇచ్చి పంపించాడు. పోలీస్ అధికారులు ఫొటో వెరిఫికేషన్ చేసుకోకుండా, బావ బదులు బావమరిదిని కానిస్టేబుల్ అనుకుని తీసుకున్నారు. అప్పట్నుంచి ఇంట్లోనే పోలీస్ మ్యాన్యువల్, పోలీస్ ఆయుధాల వాడకం, సెల్యూట్ చేసే పద్ధతి.. అన్నీ నేర్పించాడు. ఇలాగే 9 ఏళ్లు గడిచిపోయాయి.

  బావ పోస్ట్ లో బావమరిది కానిస్టేబుల్ గా కొనసాగాడు. బావమాత్రం వ్యాపారాల్లో మునిగిపోయాడు. అయితే కాల్ సెంటర్ డ్యూటీలో ఉన్న అనిల్ సోని అసలైన కానిస్టేబుల్ కాదని, అతడి బావ పోస్ట్ లో అతడు పనిచేస్తున్నాడని, బంధువు ఒకడు చెప్పడంతో ఈ మోసం బయటపడింది. దీంతో బావమరిది అనిల్ సోనిని అరెస్ట్ చేశాడు ఇప్పుడు అనిల్ కుమార్ పరారీలో ఉన్నాడు. పోలీసు శాఖలోనే నకిలీ పోలీస్ పనిచేస్తుంటే, పట్టించుకోని అధికారులు ఇక దొంగల్ని ఏం పట్టుకుంటారని, ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయింది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..