అతితెలివితో అబ్బాకొడుకులిద్దరూ జైలుకు..

  0
  2283

  తాగుబోతు కొడుకు , కిక్కెక్కిన తర్వాత కారుతోలి , ఒకరి మృతికి కారణమైన కేసులో , కొడుకుతో పాటు , తండ్రినీ జైలుకు పంపారు. మద్యం మత్తులో కారు తోలిన కొడుకు స్థానంలో డ్రైవర్ ను పెట్టి కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడంతో కొడుకు సుజిత్ రెడ్డితోపాటు , తండ్రి రఘునందన్‌ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. హైదరాబాద్ మాదాపూర్ లో ఈ నెల 27 ఉదయం 5.30 గంటల సమయంలో తప్పతాగిన స్థితిలో ఆడి కారు డ్రైవ్ చేసి , ఆటోను గుద్దడంతో ఆటోలో వ్యక్తి చనిపోయాడు. వాకిటి సుజిత్‌ రెడ్డి స్నేహితుడు ఆశిష్‌తో పాటు మరో ముగ్గురు కలిసి గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్‌ సమీపంలోని ఓ ఇంట్లో పార్టీ చేసుకొని మద్యం సేవించారు..

  ప్రమాదం తర్వాత కారు నంబర్ ప్లేట్ తీసేసారు. సుజిత్ రెడ్డి , తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఆయన వచ్చి , కొడుకుని వేరే చోట దాచిపెట్టి , డ్రైవర్ కారు తోలి ప్రమాదానికి కారణం అయ్యాడని చెప్పించాడు. అయితే తండ్రి ,కొడుకుల కుట్రను సిసి కెమెరా బయటపెట్టింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత , వాళ్ళు కారు దిగి పారిపోతున్న దృశ్యాలు పోలీసు కంటపడటంతో , మద్యం మత్తులో ప్రమాదం చేసిన సుజిత్ రెడ్డి , కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నంచేసిన తండ్రి రఘునందన్‌ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.