భార్యకు భయపడి కరోనా ఉందని ఇంటికి రాకుండా .

  0
  835

  కరోనా లేదని నకిలీ సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నారని తెలుసుగానీ , కరోనా లేకపోయినా , ఉందని నకిలీ పాజిటివ్ రిపోర్ట్ సృష్టించాడని ఒకడిపై కేసు నమోదు అయింది,,అయితే కరోనా లేకపోయినా ఉన్నట్టు ఆ యువకుడు నకిలీ రిపోర్ట్ ఎందుకు సృష్టించాడో తెలిస్తే మనకు మతిపోతుంది.. భార్యకు దూరంగా ఉండాలని సంజు అనే ఈ యువకుడు నకిలీ పాజిటివ్ రిపోర్ట్ తెచ్చుకొని , దాన్ని తన భార్యకు , తండ్రికి వాట్సాప్ లో పంపాడు.

  26 ఏళ్ళ సంజుకి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లయింది.. మధ్యప్రదేశ్ లోని మో అనే టౌన్ కి చెందిన సంజు , ఒక లేబొరేటరీ వెబ్ సైట్ లో ఈ రిపోర్ట్ ఒకటి డౌన్ లోడ్ చేసి , దానిలో తన పేరు మార్చుకొని , దాన్ని భార్యకు , తండ్రికి పంపాడు. ఇప్పుడు కరోనా కాబట్టి తాను ఇంటికి రాలేనని , కొన్నాళ్ళు దూరంగా ఉండాలని మెసేజ్ పెట్టాడు. అయితే సంజు పంపిన ల్యాబ్ కు వెళ్లిన అతడి తండ్రికి , తన కొడుకు పేరుతో అక్కడ ఎటువంటి రిపోర్ట్ లేదని తేలింది. అయితే తమ ల్యాబ్ రిపోర్ట్ నకిలీది చేశారని , ల్యాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యకు దూరంగా ఉండాలని ఇలా చేసానని సంజు చెప్పాడు. తనను విపరీతంగా వేధిస్తోందని , ఆమెకు భయపడే కరోనా ఉందని నకిలీ పాజిటివ్ రిపోర్ట్ తయారుచేసుకున్నానని తెలిపాడు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.