భార్య శవం పక్కనే తాగుబోతు భర్త నిద్ర.

  0
  2520

  మద్యం మత్తు తలకెక్కడంతో ఓ భర్త తన భార్య చనిపోయిన విషయాన్ని కూడా గుర్తించలేదు. ఉరేసుకుని చనిపోయిన భార్య శవాన్ని తాడు చాకుతో కోసి కిందకు దించాడు. ఆ తర్వాత ఆ శవం పక్కనే నిద్రపోయాడు. చివరకు కొడుకు ఏడుస్తూ ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పడంతో.. వారు వచ్చి భర్తకు నాలుగు తగిలించి అతడ్ని పక్కకు తీసుకొచ్చారు. తమిళనాడులోని పెరంబదూర్ జిల్లా బాగాలూరు కు చెందిన ధన శేఖరన్, కరూరు జిల్లాకు చెందిన మాలతికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కొడుకు ఉన్నాడు. ప్రైవేటు కంపెనీలో మేనేజర్ గా పనిచేసే ధన శేఖరన్ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. రాత్రి సరిగా ఇంటికి రాకపోవడం. ఇంటి ఖర్చులకు కూడా డబ్బు ఇవ్వకపోవడం విసుగు చెందిన భార్య కొడుకుని తీసుకుని కరూరులోని తన పుట్టింటికి వెళ్ళింది. మూడు రోజులైనా అతని మత్తు దిగలేదు. ఆ తర్వాత భార్యను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో విసిగిపోయిన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరోజు కూడా పుల్లు లోడులో ఇంటికొచ్చాడు భర్త. ఉరేసుకున్న భార్య శవాన్ని కిందకు దించాడు. అంతే ఆ శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉలుకూ పలుకూ లేకపోవడంతో కొడుకు భయంతో ఏడుస్తూ బయటకెళ్లి ఇరుగుపొరుగువారికి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని తరలించారు. మద్యం మత్తు దిగే వరకు ధన శేఖరన్ కి కోటింగ్ ఇచ్చారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.