గేమ్స్, రొమాన్స్.. అన్నీ నీళ్లకిందే..

    0
    210

    ‘డీప్ డైవ్ దుబాయ్’.. ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఈ స్విమ్మింగ్ పూల్ చోటు సంపాదించుకుంది. ఈ నెలనుంచి ఇక్కడ పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు. కరోనా భయాలు తగ్గిపోవడంతో ఇప్పుడు పర్యాటకులు అక్కడికి క్యూ కడుతున్నారు.

    దుబాయ్ లో చాలా వింతలు విశేషాలున్నాయి. ఎడారిలో కూడా పచ్చదనం నింపడం అక్కడి ప్రభుత ప్రత్యేకత. బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్, అట్లాంటిస్ హోటల్, పామ్ ఐలాండ్స్.. ఇలా ప్రభుత్వం ఇన్నింటిని ఏర్పాటు చేసిందంటే విశేషమే. ఇప్పుడు దుబాయ్ లోని మరో అద్భుతం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌ దుబాయ్ లో ఘనంగా ప్రారంభమైంది.

    ఇది సాదాసీదా స్విమ్మింగ్‌ పూల్ కాదు. ఇందులో ఓ అద్భుత లోకం దాగి ఉంది. కొన్ని అంతస్తుల లోతు ఉండే ఈ ఈతకొలనులో డైవింగ్ చేస్తూ బయట ప్రపంచాన్ని కూడా చూడవచ్చు. దుబాయ్ యువరాజు హమ్‌ దన్ బిన్ మొహ్మద్ ప్రారంభించిన ఈ స్విమ్మింగ్‌ పూల్ నిజంగా ఓ అద్భుతమే. హమ్‌ దన్ ఈ స్విమ్మింగ్ పూల్ గురించి వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

    మానవుడు నిర్మించిన పాతాళ లోకంగా దీన్ని నెటిజన్లు వర్ణిస్తున్నారు.

    స్విమ్మింగ్ పూల్ స్పెషాలిటీ ఏంటంటే..?
    ఈ స్విమ్మింగ్‌ పూల్ ను, నాడ్ అల్ షేబా ప్రాంతంలో నిర్మించారు. దుబాయ్ యువరాజు హమ్‌ దన్ బిన్ మొహమ్మద్ ప్రారంభించిన ఈ స్విమ్మింగ్‌పూల్ లోతు 60 మీటర్లు (196 అడుగులు). ఇది పూర్తిగా నిండాలంటే 1.4 కోట్ల లీటర్లు నీరు అవసరం. అంత పెద్ద ఈత కొలనును శుద్ధి చేయడం కూడా పెద్ద సవాలే. దీనికి నాసా రూపొందించిన ఫిల్టర్ టెక్నాలజీని వాడుతున్నారు.

    ఈ కొలనులోకి కేవలం డైవింగ్‌కు మాత్రమే అనుమతి ఇస్తారు. ఇందులోకి దిగితే ఎన్నో అందమైన కళాఖండాలను చూడవచ్చు. నీటి అడుగున సేద తీరేందుకు ప్రత్యేకంగా కూర్చీలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో ఫ్లోరులో ఒక థీమ్‌ ఏర్పాటు చేశారు. మునిగిపోయిన ఇల్లు నుంచి అడవిని తలపించే నమూనాలెన్నో ఇందులో చూడవచ్చు. ప్రపంచంలో ఇప్పటివరకు లోతైన డీప్ డైవింగ్ పూల్ రికార్డు పోలాండ్‌లో గల ‘డీప్ స్పాట్’ పేరు మీద ఉంది. దీని లోతు 45.5 మీటర్లు (150 అడుగులు). ఇప్పుడీ రికార్డ్ ని డీప్ డైవ్ దుబాయ్ బద్దలు కొట్టింది.

     

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.