అయిన వారు దూరమైతే మానవత్వం ముందుకొచ్చింది.

  0
  933

  కులం క‌న్నా గుణం గొప్ప‌ది… మ‌తం క‌న్నా మాన‌వ‌త్వం ఇంకా గొప్ప‌ది… అని పెద్ద‌లు ఊరికే అన‌లేదు. అందుకు ఈ ఘ‌ట‌నే ఓ ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మార‌ణ‌హోమం సృష్టిస్తోంది. మ‌న‌దేశం కూడా క‌రోనా విల‌యంతో కొట్టుమిట్టాడుతోంది. అన్నీబంధాల‌ను క‌రోనా తునాతున‌క‌లు చేసేసింది. త‌ల్లిబిడ్డ‌లు, భార్యాభ‌ర్త‌లు, స్నేహితులు, బంధువులు, ఇలా అన్ని బంధాలు కోర‌లు చాచిన క‌రోనాకు భ‌య‌ప‌డి దూర‌మైపోయాయి.

  ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో మాన‌వ‌త్వం ప‌రిమిళించేలా క‌ర్నాట‌క‌లో ఓ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ హిందూ మ‌హిళ అనారోగ్యంతో చ‌నిపోయింది. క‌రోనా కూడా ఆమె లేదు. అయినా క‌రోనా భ‌యంతో ఎవ‌రూ ఆమెకు అంత్య‌క్రియులు నిర్వ‌హించేందుకు ముందుకు రాలేదు. కుటుంబ‌స‌భ్యులు కూడా వెన‌క‌డుగు వేశారు. అయితే స్థానికంగా ఉండే ముస్లింలు మాత్రం ఆమెకు అంత్య‌క్రియలు జ‌రిపించేందుకు ముందుకు వ‌చ్చారు. ఆమె పాడెను మోసుకుంటూ శ్మ‌శానం వ‌ర‌కు వెళ్ళారు. హిందూ సంప్ర‌దాయంలోనే ఆమెకు అంత్య‌క్రియ‌లు పూర్తి చేసి, మాన‌వ‌త్వాన్ని నిల‌బెట్టారు. కులం కోసం, మ‌తం కోసం కొట్టుకునే వాళ్ళు… తమ జాడ్యాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ముందుకు ప‌రిగెత్తేవాళ్ళు… ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మాత్రం అడుగు వేయ‌లేక‌పోయారు. కానీ ఈ ముస్లిం సోద‌రులు మాత్రం మాన‌వ‌త్వాన్ని బ‌తికించారు.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.