కన్నబిడ్డను ముద్దాడకుండానే..

  0
  1407

  క‌రోనా క‌న్నీటి క‌ధ‌ల్లో గుండెల్ని పిండి చేసే సంఘ‌ట‌న ఇది. మాతృత్వ‌పు మ‌మ‌కారం కోసం ఎదురుచూసిన ఓ త‌ల్లి చివ‌ర‌కు క‌న్న‌బిడ్డ‌ను క‌ళ్ళారా చూసుకోకుండానే క‌రోనా కాటుకి గురై మ‌ర‌ణించింది. క‌రుకు గుండెల్ని కూడా కంట త‌డి పెట్టించే ఈ ఘ‌ట‌న హ‌:ద‌రాబాద్ లో జ‌రిగింది. భ‌వానీ అనే యువ‌తికి కార్తీక్ అనే యువ‌కుడితో ఆరేళ్ళ క్రితం పెళ్ళ‌యింది. బిడ్డ‌ల కోసం ఎన్నో నోములు నోచారు. పూజ‌లు చేశారు. ఆస్ప‌త్రుల వెంట తిరిగారు. చివ‌ర‌కు వారి ప్ర‌య‌త్నం ఫ‌లించి భ‌వానీ గ‌ర్భం దాల్చింది. రెండు వారాల క్రితం పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు.ఆమెను క‌రోనా ర‌క్క‌సి కాటేసింది. ప్ర‌స‌వం జ‌రిగిన రెండోరోజే క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో త‌ల్లీబిడ్డ‌ల‌ను వేరుగా ఉంచారు. చికిత్స చేసి ఇంటికి పంపించేశారు. ఇంట్లో ఆక్సీజ‌న్ అందిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆమెకు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది రావ‌డంతో ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి తీసుకెళ్ళారు. అక్క‌డ భ‌వానీ తుది శ్వాస విడిచారు. బిడ్డ‌ల కోసం ఆరేళ్ళు ఎదురుచూసి, పుట్టిన బిడ్డ‌ను చేతుల్లోకి తీసుకుని ముద్దాడ‌కుండానే ఆ త‌ల్లి అనంత‌లోకాల‌కి వెళ్ళిపోయింది. హృద‌య‌విదార‌క‌మైన ఈ సంఘ‌ట‌న అంద‌రినీ కంట త‌డి పెట్టించింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.