22 నెలల తర్వాత కిలాడి లేడీలకు బెయిల్..

  0
  337

  దేశంలో సంచ‌ల‌నం క‌లిగించిన ఇండోర్ హ‌నీట్రాప్ కేసులో హైకోర్టు నిందితుల‌కు బెయిల్ ఇచ్చింది. దాదాపు 22 నెల‌ల పాటు న‌లుగురు మ‌హిళ‌ల‌ను హ‌నీ ట్రాప్ కేసులో జైలులో పెట్టారు. రాజ‌కీయంగా ఉన్న‌త స్థానంలో ఉన్న‌వారు, సెల‌బ్రిటీల‌ను ట్రాప్ చేసి వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుని, దాన్ని వీడియోగా తీసి ఆ త‌ర్వాత బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయ‌లు గ‌డించిన ఈ న‌లుగురు మ‌హిళ‌లు ఉన్న‌త‌మైన వ‌ర్గాల‌కు చెందిన వారే. పెద్ద చ‌దువులు చ‌దివి బ్యూటీ పార్ల‌ర్లు, స్కూల్స్ పెట్టుకున్న ఈ మ‌హిళ‌లు సుల‌భంగా డ‌బ్బులు సంపాదించాల‌నుకున్న ఈ మ‌హిళ‌లు హ‌నీ ట్రాప్ మార్గాన్ని ఎంచుకున్నారు.

  శ్వేతా, స్వ‌ప్నిల్, మోనిక ఈ ముగ్గురు మ‌హిళ‌లు ఓ ముఠాగా ఏర్ప‌డి త‌మ ఆధీనంలో 12 మంది అమ్మాయిల‌ను పెట్టుకున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, అహ్మ‌దాబాద్, ఇండోర్ ఇలా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఉన్న‌తాధికారుల‌కు, రాజ‌కీయ నాయ‌కులకు అమ్మాయిల‌ను పంపించేవారు. వారితో ప‌రిచ‌యాలు కూడా ఫేస్ బుక్, ఇన్స్ స్టా గ్రాం ద్వారా ప‌రిచ‌యం చేసుకునేవారు. 2019లో ఇండోర్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఇంజ‌నీర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠా అక్ర‌మాలు వెలుగులోకి వ‌చ్చాయి. హ‌ర్భ‌జ‌న్ సింగ్ కు అమ్మాయిల‌ను ఎర వేసిన ఈ హ‌నీట్రాప్ గ్యాంగ్.. అత‌డు అమ్మాయిల‌తో ఉన్న ఫోటోల‌ను చూపించి 3 కోట్లు డిమాండ్ చేసింది.

  ఆ త‌ర్వాత జ‌రిగిన విచార‌ణ‌లో 2014 నుంచి ఈ ముఠా ఇదే ప‌ని చేస్తోంద‌ని విమానాల్లో తిరుగుతూ ఉన్న‌త‌వ‌ర్గాలకు చెందిన వ్య‌క్తుల‌ను వ‌ల‌లో వేసుకుంటుంద‌ని తేలింది. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోట‌ళ్ళ‌లో ఈ ముఠా స్థావ‌రం ఏర్పాటు చేసుకుంది. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఫైవ్ స్టార్ హోట‌ళ్ళ‌లోనే దిగి త‌మ ప‌ని ముగించుకునేవి. ఈ ముఠా మోసాల‌కు బ‌లై కోట్ల రూపాయ‌లు డ‌బ్బులు పోగొట్టుకున్నారు. అయితే ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డంతో వారి ఆగ‌డాలు సాగాయి. చివ‌ర‌కు హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఫిర్యాదుతో వీరి పాపం పండింది. 2019 సెప్టెంబ‌ర్‌లో అరెస్ట‌యిన వీరు 22 నెల‌ల పాటు బెయిల్ లేకుండా జైలులోనే గ‌డిపారు. ఇలాంటి కేసులో ఇన్ని నెల‌లు బెయిల్ ఇవ్వ‌క పోవ‌డం ఓ రికార్డ్.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.