ప్రత్యేక ఆహ్వానితుల ఆశలపై నీళ్లు..

    0
    132

    తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 50మంది ప్రత్యేక ఆహ్వానితుల టీమ్ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లినట్టయింది.

    అసలు సభ్యులు 25, కొసరు 50..

    టీటీడీ చైర్మన్ సహా బోర్డులో 25మంది సభ్యులు ఇప్పటి వరకూ ఉన్నారు. వీరికి అదనంగా మరో 50మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఇటీవల వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై ఇప్పటికే పలు విమర్శలు వినిపించాయి. పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని.. దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్లు అందులో పేర్కొన్నారు. టీటీడీ స్వతంత్రతను దెబ్బతీసేలా జీవోలు ఉన్నాయని పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు వాదించారు. నిబంధనలనకు అనుగుణంగానే నియమకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.