కలెక్టర్ కూ తప్పలేదు భార్యపోరు..విడాకులకు కోర్టుకెక్కాడు.

  0
  537

  తన భార్య , అత్త వేధింపులపై సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కేసు పెట్టాడు. డబ్బులకోసం వాళ్ళ వేధింపులు తట్టుకోలేకపోతున్నానని , మానసికంగా కుంగిపోయానని చెప్పారు. బీహార్ లోని షియోహర్ కలెక్టర్ సజ్జన్ రాజశేఖర్ ఈ మేరకు పోలీస్ స్టేషన్లో కేసుపెట్టారు. ఆయనకు సితార అనే యువతితో 2017లో పెళ్లయింది. ఇద్దరు బిడ్డలు పుట్టారు. పెళ్ళైన కొన్నాళ్ళకు , తన అత్తకూడా తన ఇంటికి వచ్చిందని చెప్పాడు. కలెక్టర్ గా పనిచేస్తున్న తనను పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళని తెలిపారు. ఎలాగోలా డబ్బులు సంపాదించమని వత్తిడి చేసేవాళ్ళని , దాంతో ఇంట్లో గొడవలు వచ్చాయన్నారు. భార్య , ఆమె తల్లి బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టారని కూడా చెప్పారు. అయినా తాను లొంగలేదని అన్నారు. చివరకు , వరకట్న వేధింపులు కిందకూడా కేసుపెట్టారని అన్నారు. ఇక ఆమెతో కాపురం వీలుకాదని తాను విడాకులకు కోర్టులో పిటీషన్ వేసానన్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.