బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. తెలుగు హీరోయిన్ అరెస్ట్

  0
  1416

  టాలీవుడ్ హీరోయిన్ నైరా నేహాల్ షా ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ తో తన సినీ ప్రయాణం ప్రారంభించి, పలు తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించిన నైనా.. ఇటీవల ముంబైలో తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. మంచి పార్టీ కూడా ఇచ్చింది. ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఈ పార్టీలో డ్రగ్స్ పంపిణీ జరిగింది. ఈ సమాచారం బయటపడటంతో.. పోలీసులు పార్టీపై రైడ్ చేశారు. పక్కా సమాచారంతో నార్కోటిక్ డిపార్టెమెంట్‌ కు చెందిన పోలీసులు రైడ్ చేసి హీరోయిన్ నైరా నేహాల్ షాతో పాటు ఆమెతో ఉన్న స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బర్త్ డే పార్టీలో ఈ డ్రగ్స్ ఎలా వచ్చాయనే విషయమై ఆరా తీస్తున్నారు. వారందర్నీ జైలుకి తరలించారు.

  ఎవరెవరు వచ్చారంటే..?
  ఈ బర్త్ డే పార్టీకి నైరా హాల్‌ కు అత్యంత సన్నిహితుడైన గోవాకు చెందిన ఆమె స్నేహితుడు ఆషిక్ హుస్సేన్ హాజరయ్యారు. పోలీసులు వీళ్లిద్దరిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వీళ్లకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడ నుంచి ఎవరు వీళ్లకు సరఫరా చేసారనే విషయమై ముంబై నార్కొటిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..