టీకా వేయించుకోడానికి వెళ్లి ఏకంగా నర్సుపై కన్నేశాడు ఓ హెడ్ మాస్టర్. అంతే కాదు, అక్కడినుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని, అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. వాయిస్ కాల్స్ తో వ్యవహారం మొదలు పెట్టి, చివరకు వీడియో కాల్స్ చేసేవాడు. తనను ప్రేమించాలని, తనతో రూమ్ లో గడపాలని అడిగేవాడట. ఈ ఘటన కర్నాటకలోని బెళగావి జిల్లా దేగోవ్ లో జరిగింది.
చివరకు హెడ్మాస్టర్ ఫోన్ కాల్స్ కట్ చేస్తుండే సరికి.. మరో రూపంలో వేధింపులు మొదలయ్యాయి. తన స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయులకు టీకాలు వేయాలంటూ కబురు పంపించడం, ఆ వంకతో ఆమెతో పదే పదే మాట్లాడటం చేసేవాడు కీచక హెడ్మాస్టర్ సురేష్. దీంతో నర్స్ కి ఒళ్లు మండింది. భర్త, పిల్లలు ఉన్నారు ఇలాంటివి సరికాదు అని ఎంతదూరం చెప్పినా వినకపోవడంతో చివరకు తన బంధువుల్ని తీసుకుని స్కూల్ కి వెళ్లింది. హెడ్మాస్టర్ కి చాకిరేవు పెట్టింది. ఈ ఘటన తర్వాత విద్యాశాఖ ఆ హెడ్మాస్టర్ ని సస్పెండ్ చేసింది. ఎంక్వయిరీ వేసింది. దీనిపై పోలీసు కేసు కూడా పెట్టింది నర్సు.
A video of a headmaster of a government school being thrashed for allegedly sending lewd messages and pictures to a nurse in Belagavi district of #Karnataka has gone viral on social media. pic.twitter.com/PGFvX5dkfF
— IANS Tweets (@ians_india) August 6, 2021