న్యాయం అడిగిన చోటే ఇప్పుడు ఆమె ఎస్సై..

  0
  5416

  న్యాయం కోసం ఏ పోలీస్ స్టేషన్ కు పోయి చేతులెత్తి దండంపెట్టి న్యాయం కోసం వేడుకుందో ,అదే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆమె ఎస్సై.. ఏ వీధుల్లోఅయితే , నెలల పసికందును ఎత్తుకొని నిమ్మరసం , సోడాలు , ఐస్ క్రీమ్ లు అమ్మిందో , ఆ వీధుల్లోనే ఇప్పడు ఆమె ఎస్సై డ్రెస్సులో వ్యాన్ లో పోతోంది.. తలచుకుంటే ఆమెకేకాదు , ఆమె గత జీవితం తెలిసిన వారికికూడా సంతోషంతో కన్నీళ్లు వస్తాయి.. ఆమెపేరు ఆణి శివ.. ఉండేది కేరళలోని వరకాల.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే పెళ్లి చేశారు. బిడ్డపుట్టిన తరువాత , భర్త వదిలేసి వెళ్ళిపోయాడు.. పురిటి బిడ్డను ఎత్తుకొని స్టేషనుకు పోతే , పోలీసులు వినిపించుకోలేదు. తల్లితండ్రులు భర్తలేని భార్య ఇంటికి రాకూడదని పంపేశారు.

  ఇక అమ్మమ్మ ఇంట్లో వరండాలో తలదాచుకుంది. పొట్టోకూటికోసం , బిడ్డ పాల కోసం వీధుల్లో నిమ్మరసం అమ్మింది.. సోడాలు అమ్మింది.. బొమ్మలు అమ్మింది.. ఇలా బతుకుబండిని భారంగా ఈడుస్తున్నప్పుడే , ఒక పెద్దాయన ఆమె డిగ్రీ చదివిందని తెలిసి , ఎస్సై పరీక్షలు రాయమని సలహా ఇచ్చి , ఆర్థిక సాయం చేసాడు.. అదృష్టం వరించింది.. ఎస్సై అయింది.. ఈమె కధ తెలిసిన ఉన్నతాధికారులు , ఆమె గతంలో కన్నీటి జీవితం గడిపిన ప్రాంతానికే , ఆమెను ఎస్సైగా వేశారు.. విచిత్రం ఏమిటంటే న్యాయం కోసం ఏ పోలీస్ స్టేషన్ కు పోయి చేతులెత్తి దండంపెట్టి న్యాయం కోసం వేడుకుందో ,అదే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆమె ఎస్సై… అదే విది విచిత్రం..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..