లేటు వయసులో ప్రేమకోసం తపిస్తున్న బామ్మ..

  0
  621

  డేటింగ్ యాప్ లో లవవర్స్ కోసం వెదికేవారు చాలామందే ఉంటారు. అలాంటివారందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఈ బామ్మ. 85ఏళ్ల వయసులో కూడా తనకో తోడు కావాలంటూ డేటింగ్ యాప్స్ లో పోస్టింగ్ లు పెడుతోంది. ఈమె పోస్టింగ్ లకు భయపడి ప్రముఖ డేటింగా యాప్ టిండర్ ఈమెను బ్లాక్ చేసింది. అయినా కూడా ఈమె ఆగలేదు. ఏకంగా ప్రేమికుడు కావాలంటూ పేపర్ లో ప్రకటన ఇచ్చింది.

  85 ఏళ్ల పండు వయసులో ప్రేమ కోసం పరితపిస్తోంది న్యూయార్క్ బామ్మ. లేటు వయసులో ఘాటు ప్రేమ కోసం పురుషులు కావాలంటూ పత్రికా ప్రకటన ఇచ్చింది. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన హ్యాటీ రోట్రేజ్‌ 1984లో 48 ఏళ్ల వయసులో భర్తతో విడిపోయింది. ఆ తర్వాత జాన్‌ అనే యువకుడితో ప్రేమలోపడింది. ఇద్దరూ కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు. 2018లో ఓ టీవీ షోలో కూడా కనిపించారు. అయితే, తాజాగా ఈ ఇద్దరూ విడిపోయారు.

  ఈ నేపథ్యంలో ఒంటిరి జీవితాన్ని భరించలేకపోతున్న హ్యాటీ ప్రేమికుడికోసం అన్వేషిస్తోంది. మొన్నటి వరకు టిండర్‌ అనే డేటింగ్‌ యాప్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. సదరు డేటింగ్‌ యాప్‌లో హ్యాటీని బ్లాక్‌ చేయటంతో ప్లాన్‌ బీకి వచ్చేసింది.


  పేపర్‌లో ఓ ప్రకటన ఇచ్చింది. తనతో డేట్‌కు రావటానికి 35 సంవత్సరాల లోపు యువకులు కావాలని పేర్కొంది. ఈ ప్రకటన తర్వాత హ్యాటీకి విపరీతమైన ప్రపోజల్స్‌ వచ్చాయి.

  దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను. బంబుల్‌(డేటింగ్‌ యాప్‌)లో పోస్టులు పెడుతున్నాను. మళ్లీ డేట్‌కు వెళ్లటం ద్వారా నేను ప్రేమను పొందగలుగుతాను. నిన్న ఉదయం ఇజ్రాయెల్‌నుంచి నాకో యువకుడు ఫోన్‌ చేశాడు. అతడికి నా మీద క్రష్‌ ఉందంట. సో క్యూట్‌!’’ అని పేర్కొంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.