రెడ్ అలెర్ట్.. చెడ్డీగ్యాంగ్ మళ్లీ వచ్చింది..

    0
    9413

    కేవలం దొంగతనాలే కాదు, దోచుకున్న తర్వాత అత్యంత కిరాతకంగా హత్యలు చేసి అక్కడినుంచి పారిపోతారు చెడ్డీగ్యాంగ్ సభ్యులు. దండుపాళ్యం సినిమాలో చూపించినట్టే చెడ్డీగ్యాంగ్ కూడా చేస్తుంది. అందుకే చెడ్డీ గ్యాంగ్ అనే పేరు వింటేనే కొంద‌రికి చెమ‌ట‌లు పడ‌తాయి. మ‌రికొంద‌రికి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఒంటికి ఆయిల్ పూసుకుని, చ‌డ్డీలు మాత్ర‌మే వేసుకుని, చేతిలో మార‌ణాయుధాల‌ను ప‌ట్టుకుని దొంగ‌త‌నాల‌కు బ‌య‌ల్దేరుతుంటారు వీరు. ఇళ్ల‌కు ఎంత గ‌ట్టి తాళాలు వేసినా స‌రే.. చిటికెలో ప‌గ‌ల‌గొట్టి ఉన్నదంతా దోచుకెళ్తుంటారు. ఎవ‌రైనా అడ్డొస్తే.. వారిపై క్రూరంగా దాడి చేస్తారు.

    రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది చెడ్డీ గ్యాంగ్. ద‌మ్ముంటే త‌మ‌ను ప‌ట్టుకోవాల‌ని స‌వాల్ కూడా చేసింది. పోలీసులు రాష్ట్రాలు దాటి.. అనేక క‌ష్టాలు ప‌డి.. ఎట్టకేలకు ఈ ముఠాను ప‌ట్టుకున్నారు. ఇక వారి పీడ విర‌గ‌డ‌యిన‌ట్టేన‌ని అనుకుంటున్న సమయంలో తాజాగా మ‌రో బ్యాచ్ న‌గ‌రంలో చెల‌రేగిపోయింది.

    కీసర పీఎస్‌ పరిధిలోని నాగారంలో తాజాగా చెడ్డీ గ్యాంగ్ బీభ‌త్సం సృష్టించింది. మూడు ఇళ్లలోకి చొర‌బ‌డి 16 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయింది. ఏడు నుంచి ఎనిమిది మందితో కూడిన బ్యాచ్ అర్ధరాత్రి వీధుల వెంట తిరుగుతూ హ‌ల్‌చ‌ల్ చేసింది. తాళాలు వేసి ఉన్న ఇళ్ల‌ను టార్గెట్ చేసుకుని.. త‌మ ప‌ని పూర్తి చేసుకుంది. చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన దృశ్యాలు ప‌లుచోట్ల సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. వారి రాక‌ను చూసి వీధి కుక్కలే భ‌య‌ప‌డిపారిపోతుండ‌టం అందులో క‌నిపిస్తోంది. అంటే వారి ఆహార్యం ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. చెడ్డీ గ్యాంగ్ సంచ‌రిస్తున్నందున‌.. శివారు ప్రాంతాల ప్ర‌జ‌లు జాగ్రత్తగా ఉండాలని పోలిసుల హెచ్చరిస్తున్నారు. ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు, అలారమ్‌లు, తలుపులకు గట్టి గ‌డియ‌లు పెట్టుకోవాల‌ని సూచిస్తున్నారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.