నేను నలిపేది వాటినికాదు -నీ బాధల్ని.

  0
  10221

  చెన్నైలోని సుశీల్ హ‌రి ఇంట‌ర్నేష‌నల్ స్కూల్ అధిప‌తి శివ‌శంక‌ర్ బాబా లైంగిక వేధింపుల‌పై ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ అనుభ‌వాల‌ను చెబుతుంటే ఒళ్ళు జ‌ల‌ద‌రిస్తుంది. త‌న‌కు తాను శ్రీకృష్ణుడి అవ‌తారంగా చెప్పుకునే శివ‌శంక‌ర్ బాబు ఆధ్వ‌ర్యంలోనే ఈ స్కూల్ న‌డుస్తోంది. గ‌త కొన్నేళ్ళుగా జ‌రిగిన‌ లైంగిక వేధింపుల‌పై ఇప్పుడిప్పుడే పూర్వ విద్యార్ధులు త‌మ చేదు అనుభ‌వాల‌ను పంచుకుంటున్నారు.

  ఆ స్కూల్ లోనే ప్ల‌స్ వ‌న్ వ‌ర‌కు చ‌దివిన అమృత అనే పూర్వ విద్యార్ధిని లైంగిక వేధింపుల‌పై ప్ర‌శ్నించినందువ‌ల్లే త‌న‌ను ప్ల‌స్ టూకి కూడా రానివ్వ‌కుండా టీసీ ఇచ్చి పంపించి వేశార‌ని చెప్పింది.తాను శ్రీకృష్ణుడిన‌ని, విద్యార్ధులంతా గోపిక‌ల‌ని చెప్పేవాడ‌ని, అప్పుడ‌ప్పుడు విద్యార్దినులు స్నానం చేసేట‌ప్పుడు త‌లుపులు తీసి చూసేవాడ‌ని చెప్పింది. న‌గ్నంగా ఉన్న ఉన్న‌ప్పుడు ఆయ‌న చూసిన‌ప్పుడు అందం పెరుగుతుంద‌ని, ఆత్మ‌జ్ఞానం పెరుగుతుంద‌ని తెలిపింది.

  అబ్బాయిల‌కైతే షేక్ హ్యాండ్ ఇచ్చేవాడ‌ని, అమ్మాయిల‌ను కౌగిలించుకునే వాడ‌ని పేర్కొంది. ఇలా ఎందుకు చేస్తున్నార‌ని అడిగితే త‌న‌ను దివ్య‌శ‌క్తి అబ్బాయిల‌కు అర‌చేతి ద్వారానూ, అమ్మాయిల‌కు ఛాతీ ద్వారా లోప‌లికి పంపుతాడ‌ని చెప్పేవాడ‌ని తెలిపింది. ఇలా చేస్తే విద్యార్ధుల్లో దివ్య‌త్వం, శ‌క్తి, జ్ఞానం పెరుగుతుంద‌ని చెప్పేవాడ‌ని చెప్పింది. కొంత‌మంది విద్యార్ధినులు మాత్రం బాబా చేష్ట‌ల్లో దురుద్దేశ్యం ఉంద‌ని దూరంగా ఉండేవార‌ని చెప్పింది.

  అమ్మాయిలు ఎవ‌రైనా త‌మ స‌మ‌స్య‌ల‌ను బాబాకు చెప్పుకుంటే తీరుతాయ‌ని వార్డెన్ చెప్పేద‌ని తెలిపింది. ఆయ‌న‌కు స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు గ‌దిలోకి వెళితే, స్థ‌నాల మీద చేతులు వేసి గ‌ట్టిగా ఒత్తేవాడ‌ని, ఇలా చేస్తే బాధ‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ని చెప్పేవాడ‌ని వాపోయింది. అడ్డుచెప్ప‌కుండా మౌనంగా భ‌రించే అమ్మాయిల‌కు నేనే మీకు తండ్రి, స్నేహితుడు, ప్రియుడు, భ‌ర్త అనుకోవాల‌ని… తాను శ్రీకృష్ణుడి అవ‌తారంగా చెప్పేవాడ‌ని తెలిపింది. కొంత‌మంది విద్యార్ధినుల‌కు మాద‌క‌ద్ర‌వ్యాలు అల‌వాటు చేశాడ‌ని, రాత్రి పూట వారిని అత‌ని వ‌ద్దే ఉంచుకునేవాడ‌ని చెప్పింది.

  కొంత‌మంది విద్యార్ధినులు బాబా వ‌ల్ల వ‌చ్చిన వేధింపుల‌ను త‌ల్లిదండ్రుల‌కు చెప్పినా న‌మ్మేవారు కాద‌ని, బాబా ప‌ట్ల వారికి ఉన్న భ‌క్తే కార‌ణ‌మ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం శివ‌శంక‌ర్ బాబా జైలులో ఉన్నాడు. ఆయ‌న‌కు బ్రోక‌ర్ గా ప‌ని చేసే సుశ్మిత అనే వార్డెన్ ను కూడా అరెస్టు చేశారు. ఆమె విద్యార్ధినుల‌కు మాయ‌మాట‌లు చెప్పి బాబా ద‌గ్గ‌రికి తీసుకెళ్ళేద‌ని చెప్పింది. గ‌త 15 ఏళ్ళుగా బాబా లైంగిక వేధింపుల బారిన ప‌డిన వారంతా, అత‌ని దుర్మార్గాల‌పై గ‌ళం విప్పుతున్నారు. శివ‌శంక‌ర్ బాబాకు ప్ర‌స్తుతం 72 ఏళ్ళు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..