దుబాయి ట్రావెల్ కి గ్రీన్ సిగ్నల్.. అయితే.. ?

  0
  709

  క‌రోనా బ‌ల‌హీన‌ప‌డుతున్న నేప‌ధ్యంలో విదేశాల‌కు మ‌న దేశం నుంచి విమానాల రాక‌పోక‌లు మొద‌ల‌య్యాయి. వాటిల్లో ముందుగా దుబాయ్ కి ఈనెల 23వ తేదీ నుంచి మ‌న‌దేశం నుంచి విమానాల‌ను న‌డిపిస్తారు. అయితే ఇందుకు స‌వాల‌క్ష ఆంక్ష‌లు పెట్టారు. మ‌న దేశం నుంచి దుబాయ్ కి వెళ్ళాల‌నుకునే వారు రెసిడెన్స్ వీసా క‌లిగి ఉండాలి. రెండు డోసులు యూఏఈ ప్ర‌భుత్వం అనుమ‌తించిన రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని ఉండాలి.

  వాటిల్లో సైనోఫామ్, ఫైజ‌ర్ బ‌యో ఎంటెక్, స్పుత్నిక్ వీ, ఆక్స‌ఫ‌ర్ట్ అస్ట్రాజెనికా వ్యాక్సిన్లు వేసుకుని ఉండాలి. మ‌న‌దేశంలో దుబాయ్ విమానం ఎక్కే నాలుగు గంట‌ల ముందు ర్యాపిడ్ పీసీఆర్ ప‌రీక్ష చేసుకుని ఉండాలి. దుబాయ్ లో విమానం దిగిన వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుని రిజ‌ల్ట్ వ‌చ్చిన త‌ర్వాత‌నే అనుమ‌తిస్తారు. ఈ టెస్ట్ వ‌చ్చేందుకు 24 గంట‌లు స‌మ‌యం ప‌డుతుంది. అంత‌వ‌ర‌కు విమానాశ్ర‌యంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉండాలి. ఏప్రిల్ నుంచి దుబాయ్ కి భార‌త్ కు మ‌ధ్య విమానాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..