మంత్రి అయితే 170 కిలోమీటర్ల స్పీడ్ లో కారు డ్రైవ్ చెయ్యొచ్చా ..?

    0
    1841

    కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిర్మాణంలో ఉన్న ఎక్స్ ప్రెస్ హైవేపై కారులో స్వ‌యంగా డ్రైవ్ చేశారు. ఢిల్లీ-ముంబయి మధ్య ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతోంది. ఈ హైవే పరిశీలన కోసం గడ్కరీ వచ్చారు. ఈ సందర్భంగా ఎక్స్ ప్రెస్ హైవే నిర్దేశిత ప్రమాణాల మేర నిర్మాణం జరుపుకుంటోందా, లేదా అని ప‌రిశీలించారు. అంత‌టితో ఆగ‌కుండా ఎక్స్ ప్రెస్ హైవేపై స్పీడ్ టెస్టుకు వెళ్ళారు. కియా కార్నివాల్ కారులో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు.

    ఆయన డ్రైవరు పక్క సీటులో కూర్చొనగా, ఓ దశలో కారు స్పీడోమీటర్ ముల్లు 170 కిలోమీటర్లను సూచించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలను కలిపేందుకు ఉద్దేశించిన ఈ ఎక్స్ ప్రెస్ హైవే 1,380 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుపుకుంటోంది. దేశంలోనే అత్యంత పొడవైన రహదారి ఇదే కానుంది. అయితే ఈ వీడియో చూసిన వారు మాత్రం సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కేంద్ర‌మంత్రి అయితే మాత్రం ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తారా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. వాస్త‌వానికి హైవేపై గ‌రిష్ట వేగం 120 కి.మీ. కానీ గ‌డ్కారీ మాత్రం అంత‌కుమించిన స్పీడ్ తో వెళ్ళారు.

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..