అమ్మానాన్నల మీదనే కేసుపెట్టిన హీరో విజయ్..

  0
  2417

  రాజకీయాల్లో తన పేరుని తన అనుమతిలేకుండా వాడుతున్నారని తమిళ్ సినీ హీరో ‘ఇళయదళపతి’ విజయ్‌ కేసు పెట్టారు. ఇంతకీ ఆయన కేసు పెట్టింది ఎవరిమీదో తెలుసా..? స్వంత తల్లి , తండ్రులమీదనే.. విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ అనే పేరుతొ గతంలోనే విజయ్ తండ్రి ఒక రాజకీయపార్టీని పెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్‌ అయింది.

  ఆ పార్టీతో తనకు సంబంధం లేదని విజయ్ అప్పుడే చెప్పారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ తరపున కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సమావేశాలు కూడా నిర్వహితున్నారు. విజయ్ ఫొటోతోనే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయన తన అనుమతిలేకుండా, తనపేరు , తన ఫొటోతో చేస్తున్న ప్రచారం వల్ల తనకు చెడ్డపేరు వస్తుందని ఆరోపిస్తూ , చెన్నై సిటీ సివిల్ కోర్టులో తన తల్లి తండ్రులు , మరో 11 మందిపై కేసు పెట్టారు..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..