ఆమెకు కటింగ్ బాగాలేదు ,2 కోట్లు ఇవ్వండి..

    0
    115

    నెత్తిమీద జుట్టు కొంతపోతే పోయిందిగానీ , రెండు కోట్ల నష్టపరిహారం కొట్టేసింది ఒక మోడల్ గర్ల్.. ఢిల్లీలోని ఐటిసి మౌర్య హోటల్లో సెలూన్ కి ఒక మోడల్ పోయింది. హెయిర్ కట్టింగ్ ఏళ్ళ చెయ్యాలో చెప్పింది. తనకు ఏ స్టైల్లో హేయిర్ కట్ చెయ్యాలో చెప్పింది. సెలూన్ లో తనకు అలవాటుగా చేసే హెయిర్ కట్టర్ ని కాకుండా , మరి హెయిర్ డ్రెస్సర్ ని పెట్టారు. హెయిర్ కటింగ్ తర్వాత , తానూ అనుకున్న లెవెల్లో , చెప్పినట్టు హెయిర్ కట్ చేయలేదని ఆమె ఫిర్యాదు చేసింది. పైగా హెయిర్ ట్రీట్మెంట్ కోసం వాడిన లోషన్స్ వల్ల తనకు అలెర్జీ వచ్చిందని , జుట్టుకూడా ఊడుతుందని తెలిపింది. మోడలింగ్ తోనే , తన జీవనమని , సినిమాల్లోకూడా అవకాశాలు వచ్చాయని , ఇప్పుడు జుట్టు ఊడిపోతుండటంవల్ల తనకు అవకాశాలు పోయాయని , అందువల్ల తనకు 2 కోట్ల రూపాయలు నష్ట పరిహారం ఇప్పించాలని ఆమె జాతీయ వినియోగదారుల ఫోరమ్ లో కేసు పెట్టింది. ఈ కేసు విచారించిన న్యాయమూర్తులు , జస్టిస్ ఆర్ కె అగర్వాల్ , కాంతికర్ , మోడల్ కి 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పుచెప్పారు. మహిళలకు జుట్టు ,అలంకారమని , దానికోసం చాలా జాగ్రత్తగా ఉంటూ , కేశ సౌందర్యాన్ని కాపాడుకుంటారని చెప్పారు. అందులో కేసు పెట్టిన మహిళ , మోడలింగ్ రంగంలో ఉందని , జుట్టులేకుండా ఆమె ఎలా వృత్తిలో రాణిస్తుందని అన్నారు. అందుకే ఆమెకు 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పుచెప్పారు..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.