ఫైండ్ మై ఐ ఫోన్ యాప్ తో బిడ్డలు దక్కారు..కిడ్నాపర్ చిక్కాడు.

    0
    54

    కిడ్నాప‌ర్ చెర నుంచి ముగ్గురు పిల్ల‌ల‌ను ‘ఫైండ్ మై ఐ ఫోన్ యాప్’ కాపాడింది. అదెలా అంటే జ‌హీద్ న‌జీర్ అనే వ్య‌క్తి భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి ఓ ఫంక్ష‌న్ వెళ్ళి ఇంటికి తిరిగి వ‌స్తున్నాడు. మ‌ధ్య‌లో తెలిసిన వాళ్ళు క‌న‌ప‌డితే అత‌ను, భార్య ఇద్ద‌రు కారు దిగి, అవ‌త‌లివారితో మాట్లాడుతున్నారు. ఈలోగా ఓ వ్య‌క్తి కారును ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ స‌మ‌యంలో పిల్ల‌లు కూడా కారులోనే ఉన్నారు. హ‌ఠాత్తుగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో జ‌హీద్ దంపతులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే అత‌ని భార్య ఐఫోన్ కారు బ్యాక్ సీట్లోనే ఉండ‌డంతో, ‘ఫైండ్ మై ఐ ఫోన్ యాప్’ ద్వారా ట్రేస్ చేశారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆల్రెడీ ఆ ఐపోన్ లో ఈ యాప్ ఉండ‌డంతో, కిడ్నాప‌ర్ లోకేష‌న్ ట్రేస్ చేయ‌డం సులువైంది. ఆ వెంట‌నే పోలీసులు లోకేష‌న్ ట్రేస్ చేసి, కిడ్నాప‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మాంచెస్ట‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

    ఇవీ చదవండి..

    కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

    ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

    అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

    తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.