రెండు వేల నోటు జెరాక్స్ తీసి, భార్య అకౌంట్ లో..

  0
  26182

  ఆహా .. ఈ దొంగోడి తెలివి అమోఘం.. రెండు వేలరూపాయల నోటు జెరాక్స్ తీసి , భార్య అకౌంట్ లో , బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ద్వారా డిపాజిట్ చేశాడు.. ఆ ఏటీఎం మెషీన్ కూడా నిద్రపోతున్నట్టుంది ..నకిలీ నోట్లను తీసుకొని డిపాజిట్ రసీదు ఇచ్చేసింది.. ఆ వెంటనే మరో ఏటీఎం కు పోయి ఇంతకుముందు డిపాజిట్ చేసిన 60 వేలు మంచి నోట్లు డ్రా చేసుకున్నాడు. తమిళనాడు లోని పుదుకోటై జిల్లా అరంతాంగిలో ఈ మోసం జరిగింది. తమ ఏటీఎం లో జెరాక్స్ తీసిన రెండు వేల నోట్లు వస్తున్నాయని తెలిసి , తనికీ చేయగా , ఈ మోసం బయటపడింది.. సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా శరవణన్ అనే మోసగాడిని అరెస్ట్ చేశారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..