ఫేస్ బుక్ , వాట్సాప్ , ఇన్స్టా ఎందుకు మొరాయించాయి..

  0
  269

  రోజులో ఎక్కువ భాగం ఫేస్ బుక్ , వాట్సాప్ , ఇన్స్టా గ్రామ్ లో తల దూర్చే సోషల్ మీడియా వీక్షకులు అల్లాడిపోయారు.. మన దేశంలో రాత్రి 9 గంటలనుంచి  8 గంటలపాటు అవేవీ పనిచేయలేదు. దీనికి ప్రత్యేక కారణమంటూ ఆ సంస్థలు కూడా ఏమీ చెప్పలేదు. దీంతో వాటి ట్రేడింగ్ లో 5 శాతం తగ్గుదల కనిపించింది. మొత్తానికి అనేక దేశాలలో ప్రజలు ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ పనిచేయకపోవడంతో అల్లాడిపోయారు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో కాసేపైనా ఫేస్ బుక్ లో తలదూర్చందే మంచమెక్కే అలవాటులేని జనం దీంతో ఏమీ తోచక తికమక పడ్డారు. ఇవి ఎందుకు పనిచేయడంలేదన్న విషయమై గూగుల్ లో వెదికిన వారు గంటలో 42 లక్షలకు పైగానే ఉన్నారట.. డౌన్ టైం మెయింటేనెన్స్ కింద ఇలా జరిగిందని కొందరంటే , మరికొందరు పేస్ బుక్ కమ్యూనిటీ రూల్స్ , అకౌంట్ వెరిఫికేషన్ లో కోట్లాది పేజీలు తొలగించడంలో సర్వర్లలో జాం కారణంగా ఇలా జరిగిందని చెప్పారు. ఫేస్ బుక్ మాత్రం అంతరాయానికి చింతిస్తున్నామని ఒక్క మాట చెప్పేసి మౌనంగానే ఉండిపోయింది..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.