వేల కార్లమీద మొక్కలు పెంచుతున్నారు..

    0
    90

    ప్రపంచంలో పర్యాటక ప్రధానమైన దేశాల్లో థాయిలాండ్ అతి ముఖ్యమైనది థాయిలాండ్ దేశానికి పర్యాటక రంగమే వెన్నెముక. అయితే ఇప్పుడు కరోనా కష్టాలు, ఆంక్షలు, భయాల మధ్య ఆదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగాకుదేలైంది. ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం అంటే, ఆ దేశంలో ప్రధానమైన రవాణా రంగం దెబ్బతిన్నది. కొన్ని వేల కార్లు మూలబడిపోయాయి.

    కనీసం డ్రైవర్లకు జీతాలిచ్చేందుకు, వారిని పోషించేందుకు డబ్బులు లేని పరిస్థితి. థాయిలాండ్ లో అతి పెద్ద ట్యాక్సీ సంస్థలన్నీ కార్లు అద్దెకిచ్చే వాహన రంగాలన్నీ, సహకార సంస్థలుగా ఏర్పడి ఉంటాయి. దీంతో వారికి జీతాలిచ్చేందుకు వేలాదికార్లపైన మట్టిపోసి ఆకు కూరలు పెంచుకుంటున్నారు.

    పర్యాటకులెవరూ రాకపోవడంతో కొన్ని వందల ఎకరాల ప్రాంతంలో ఈ కార్లు నిలబడిపోయాయి. గోవరన్ ట్యాక్సీ సహకార సంస్థ ఆధ్వర్యంలో 500 కార్లను ఒకే పార్కింగ్ ప్లాంట్ లో పెట్టి మొక్కలు వేశారు. మరో ప్రాంతంలో తపకోరన్ అనే కార్ల సహకార సంస్థ 2500 కార్లను ఒకే దగ్గర ఉంచి, అన్నిటి టాప్ లపై మట్టిపోసి కాయగూరలు పెంచుతున్నారు.

    టాప్ రేకు చెడిపోకుండా ముందుగా వాటిపై పాలిథిన్ పేపర్ వేసి ఆ తర్వాతే మొక్కలు పెంచుతున్నారు. ఇలా పెంచిన మొక్కలు, ఆకు కూరలు, కాయగూరలను అమ్మి ట్యాక్సీ డ్రైవర్లకు 30శాతం జీతాలు ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షలు సడలిస్తున్నా, పర్యాటకులు మాత్రం థాయిలాండ్ కి వచ్చేందుకు ఇష్టపడటంలేదు.

    ప్రభుత్వం కూడా పర్యాటకులకు కరోనా నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు విధించడంతో వారు వచ్చేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఆంక్షలు సడలించి తమకు ఉపాధి దెబ్బతినకుండా చూడాలని వారు కోరుతున్నారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.