మావటి మృతదేహంవద్ద గజ విలాపం..

  0
  36

  మనిషికి మేథస్సు ఉంటుందని, జంతువులకు ఉండదని అంటుంటారు. కానీ కొన్ని జంతువులకు అద్భుతమైన మేథస్సు, గ్రహణ శక్తి, విశ్వాసం ఉంటాయి. వీటిల్లో మనుషులకంటే కొన్ని సందర్భాల్లో జంతువులకే ఇవి ఎక్కువగా ఉంటాయి. యజమానులపై ప్రేమాభిమానాలుంటాయి. అనేక సందర్భాల్లో కుక్కల విషయంలో ఇది నిరూపితమైంది.

  ఇప్పుడు ఓ ఏనుగు తన మావటి చనిపోయినప్పుడు, ఆయన మృతదేహానికి కన్నీటితో నివాళులర్పించింది. మృతదేహం దగ్గరకు వెళ్లి తొండం ఎత్తి, దండం పెట్టి, కన్నీరు పెట్టి అలాగే ఉండిపోయింది. ఈ దృశ్యం చూసిన బంధు మిత్రుల రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. కాసేపు అలాగే దిగులుగా ఉండిపోయిన ఏనుగు, ఆ తర్వాత వెనక్కు వచ్చింది. ఆ ఏనుగు చిన్నప్పటినుంచి అతనే పెంచి పెద్దచేసి, మావటిగా ఉన్నాడు. ఇంటి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు దానికి తన మావటి చనిపోయాడని అర్థమై కన్నీరు పెట్టింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..