షూటింగ్ లు ఆగడంతో రూటు మార్చిన తారలు..

  0
  592

  కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ లు, మోడలింగ్ షూట్స్ ఆగిపోవడంతో వ్యభిచార వృత్తిలోకి వచ్చామని నిన్న ముంబైలోని థానేలో అరెస్ట్ అయిన ఇద్దరు తమిళ సినీ తారలు చెప్పారు. సినీ మోడలింగ్ రంగాల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన తాము, ఆ తర్వాత కరోనా కారణంగా వచ్చిన ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నామని, ఒకరకంగా పూట గడవటమే కష్టంగా ఉందని చెప్పారు. అందువల్లనే, ముంబైలో డబ్బులు వస్తాయని, ఈ పనికి ఒప్పుకున్నామని, రెండు వారాలు తమకు ఒక్కొకరికి బేరం కుదుర్చుకున్నారని, ఇక్కడికి వచ్చాక లక్షా 80వేల రూపాయలకు ఫైనల్ చేసుకున్నారని అన్నారు.

  తమలాగే దక్షిణాది సినీ, మోడలింగ్ రంగాలనుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేసి, డబ్బులు సంపాదించుకుని పోతున్నారని, దళారుల ద్వారానే తాము ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు, పునరావాస కేంద్రానికి తరలించి అక్కడినుంచి ఏంచాయాలనే ఆలోచనలో ఉన్నారు. వీరితో ఒప్పందం కుదుర్చుకున్న దళారులను, వేశ్యా గృహ యజమానులైన ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి జైల్లోకి పంపారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..