గజరాజు కదా..?ఎదురు పొతే ఇలాగే ఉంటుంది..

    0
    192

    గ‌జ‌రాజు న‌డుస్తూ వెళుతుంటే… ఆ గాంభీర్యం.. ఆ హుందాత‌న‌మే వేరు.. చూసి తీరాల్సిందే. వాహ‌నాల్లో వెళుతున్నా.. ఏనుగు క‌నిపిస్తే అది త‌న దారిన వెళ్ళే వ‌ర‌కు వాహ‌నాలు ఆపి మ‌రీ చూస్తుంటారు. వాహ‌నాలు ఆప‌కుండా ముందుకి వెళ్ళినా, వెన‌క్కి తీసినా, హార‌న్ కొట్టినా… గ‌జ‌రాజు కోపాన్ని చ‌విచూడాల్సి వ‌స్తుంది. స‌రిగ్గా అలాంటి ఘ‌ట‌నే త‌మిళ‌నాడు రాష్ట్రంలోని నీల‌గిరి జిల్లాలో చోటుచేసుకుంది. త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బ‌స్సు కూనూరుకి వెళుతోంది. ఆ ప్రాంతంలో ఏనుగ‌ల సంచారం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో డ్రైవ‌ర్లు ఆచితూచి వెళుతుంటారు. కాస్త అటుఇటూ హంగామా చేశారంటే మాత్రం… గ‌జ‌రాజు త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తాడు. అయితే ఇక్క‌డ కూడా ఓ డ్రైవ‌ర్ అత్యుత్సాంతో… ఏనుగు వెళుతుంటే… దాన్ని చూసి రివ‌ర్స్ గేర్ వేసుకుని వెన‌క్కి వెళ్ళాడు. అంతే ఆ ఏనుగుకి చిర్రెత్తుకొచ్చింది. ప‌రుగుప‌రుగున వ‌చ్చి బ‌స్సు ముందు అద్దాల‌ను త‌న వాడి దంతాల‌తో పొడిచింది. అంతే అద్దాలు కాస్తా ప‌గిలి ముక్క‌ల‌య్యాయి. ఆ త‌ర్వాత భ‌యంతో డ్రైవ‌ర్ బ‌స్సు ఇంజ‌న్ ఆపేసి, వెన‌క్కి వెళ్ళిపోయాడు. లోప‌లి ప్ర‌యాణీకుల‌ను కూడా వెన‌క్కి వెళ్ళ‌మ‌న్నాడు. కాసేపు అటుఇటు చూసిన‌ గ‌జ‌రాజు… తాపీగా వెన‌క్కిమ‌ళ్ళాడు. ఇక‌ హ‌మ్మ‌య్యా అంటూ బ‌స్సులో ఉన్న‌వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

     

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.