పోసానిపై పవన్ అభిమానుల దాడి..

  0
  511

  పవన్ కల్యాణ్ పై వరుసగా రెండోరోజు ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై పవన్ కల్యాణ్ అభిమానులు దాడిచేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన ఆందోళనకారులను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు. పోసానిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు.. అనంతరం పోలీసు వాహనంలోనే ఆయన ఇంటికి తరలించారు. ‘‘పవన్‌ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నేను చనిపోతే అందుకు పవన్‌ కల్యాణే కారణం. అతనిపై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తా’’ అని తెలిపారు పోసాని. అంతకు ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ అభిమానులు తన సెల్ ఫోన్ కి అసభ్య సందేశాలు పంపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసానిపై.. జనసేనాని అభిమానులు దాడిచేసేందుకు ప్రయత్నించారు.

   

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.