రేపు భూమి పరిభ్రమణ వేగం త‌గ్గుతుంద‌ట !

  0
  263

  భూమి పరిభ్రమణ వేగం త‌గ్గుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. ప్రతి ఏడాది జులై 2వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యన భూభ్రమణ వేగం మందగిస్తుందట. దీన్ని ఎపిలియన్ అంటారు. ముఖ్యంగా, జులై 5న ఈ వేగం అత్యంత కనిష్ఠానికి చేరుకుంటుందని గుర్తించారు. సాధార‌ణంగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడితే, సూర్యుడిని చుట్టి రావడానికి 365 రోజుల సమయం పడుతుందన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఈ క్రమంలో భూమి 930 మిలియన్ కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో భూమి పరిభ్రమిస్తుంటుంది. అయితే ఈ వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదట‌. ప్రతి ఏడాది జులై 2వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యన భూభ్రమణ వేగం మందగిస్తుందట. ముఖ్యంగా జులై 5న ఈ వేగం అత్యంత కనిష్ఠానికి చేరుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యుడి శక్తి ఆధారంగానే భూభ్రమణం చెందుతుందట‌. అందువ‌ల్ల‌ జులై 2 నుంచి 7వ తేదీ మధ్యలో సూర్యుడి నుంచి భూమి అత్యంత దూరంగా వెళ్లిపోతుందట‌. దాంతో తక్కువ శక్తి పొందిన కారణంగా భూమి వేగం బాగా నెమ్మ‌దిస్తుంద‌ట‌. గ్రహాలు సూర్యుడికి దూరంగా ఉన్నప్పటి కంటే, దగ్గరగా వచ్చినప్పుడు వేగంగా పరిభ్రమిస్తాయని కెప్లర్ గ్ర‌హ గ‌మ‌న సూత్రాల వ‌ల్ల తెలుస్తుంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.