తాగుబోతు గేదెలు.. దొంగసారా గుట్టు విప్పాయి..

  0
  422

  రోజూలాగే కుడితి తొట్లో నీళ్లు తాగాయి ఆ గేదెలు. కానీ ఆరోజు మాత్రం వాటికి ఏదో అయింది, మందు మైకం తలకెక్కింది. అప్పటినుంచి మేత తినడంకంటే ఎక్కువగా నీళ్లుతాగడం మొదలు పెట్టాయి. ఆ నీటిలో కలిపిన మందుతాగి తూగుతున్నాయి. వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాయి. దీంతో అనుమానం వచ్చిన యజమాని వాటిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. గేదెలు తాగిన నీటిని పరిశీలించిన డాక్టర్, అందులో మద్యం కలిసి ఉన్నట్టు గుర్తించాడు.
  అసలేం జరిగిందంటే..?
  ఈ వింత సంఘటన గుజరాత్ లో జరిగింది. ముగ్గురు రైతులు అక్రమంగా సారా అమ్ముతున్నారు. లిక్కర్‌ సీసాలను గేదెలు తాగే నీటి తొట్టెల్లో దాచేవారు. అయితే కొన్ని సీసాలు పగలడంతో సారా నీటిలో కలిసింది. ఈ నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించాయి. డాక్టర్ రాకతో అసలు విషయం బయటపడింది. అక్రమ సారా అమ్మకాల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు డాక్టర్. దీంతో పోలీసులు రైడ్‌ చేశారు. రహస్యంగా దాచిన రూ.32,000 విలువైన వంద మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రైతులను అరెస్ట్‌ చేసి వారిపై కేసు నమోదు చేశారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.