కొవాక్సిన్ తీసుకుంటే అక్కడ నో ఎంట్రీ..

  0
  320

  భారత్ లో వేస్తున్న కొవిషీల్డ్, కొవాక్సిన్, స్పుత్నిక్-వి టీకాల్లో.. కొవాక్సిన్ ను అన్ని దేశాలు గుర్తించడంలేదు. ఇంకా మూడో దశ క్లినికల్ పరీక్షలు ముగియకపోవడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతివ్వకపోవడంతో కొవాక్సిన్ తీసుకున్నవారికి నో ఎంట్రీ అనేస్తున్నాయి కొన్ని దేశాలు.

  అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా వంటి దేశాలు.. తమ ప్రభుత్వం అనుమతిచ్చిన, లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతిచ్చిన టీకాలను మాత్రమే అధికారికంగా గుర్తిస్తున్నారు. భారత్ లో వేసే కొవాక్సిన్ ను ఆయా దేశాలు ఇంకా గుర్తించలేదు. అందుకే కొవాక్సిన్ వేయించుకున్న వాళ్లకు కి ఆయా దేశాల్లో నో ఎంట్రీ అంటున్నాయి.

  ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు కొంతమంది కొవాక్సిన్ తీసుకున్నారు. ఇప్పుడు అమెరికా, బ్రిటన్ ఆ టీకాను గుర్తించడంలేదనే సరికి దీంతో వీరు డైలమాలో పడ్డారు. కొవాక్సిన్ తీసుకున్నవారు అమెరికా, బ్రిటన్ వెళ్లినా కూడా అక్కడ హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందే, కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఇచ్చిన పరిమితులన్నీ వీరికి ఇవ్వరు.

  మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకముందే డీసీజీఐ అనుమతిచ్చినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతివ్వకపోవడంతో కొవాక్సిన్ తీసుకున్నవారు విదేశాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..