విమానంలో తాగుబోతు రచ్చ.. సీటుకు కట్టేశారు..

  0
  84

  విమానంలో ఓ యువ‌కుడు హ‌ల్చ‌ల్ చేశాడు. తోటి ప్ర‌యాణీకుల‌ను ఇబ్బందుల‌కు గురి చేశాడు. ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో. చివ‌రికి విమాన సిబ్బంది ఆ యువ‌కుడికి సీటుకి కట్టిప‌డేశారు. అమెరికాకు మాక్స్‌వెల్ బెర్రీ అనే యువకుడు విమానంలో ప్రయాణిస్తూ అసభ్య చేష్టలకు దిగాడు. ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళ్తున్న ఈ విమానంలో మహిళా సిబ్బందిని తాకరాని చోట తాకుతూ వారిని ఇబ్బంది పెట్టాడు. అతడి వెకిలి చేష్టలు భరించలేని తోటి ప్రయాణికులు ప్రశ్నిస్తే వారితోనూ వాగ్వివాదానికి దిగాడు. అత‌ని వికృత చేష్ట‌ల‌కు విసిగిపోయిన సిబ్బంది అత‌డిని సీటుకి క‌ట్టేశారు. మాట్లాకుండా నోటికి టేప్ అతికించారు. విమానం ల్యాండ్ అయ్యాక విమాన సిబ్బంది యువకుడిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.