డ్రగ్స్ తీసుకునే వాళ్లలో ఆత్మహత్య లెక్కువ..

    0
    123

    సాధార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకునే వారి కంటే, డ్ర‌గ్స్ తీసుకునే వారే ఎక్కువ‌గా సుసైడ్ చేసుకుంటార‌ని తాజా ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అమెరికాకు చెందిన అంత‌ర్జాతీయ సంస్థ యుఎస్ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆన్ డ్ర‌గ్స్ అబ్యూస్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యం వెల్ల‌డైంది. 2 ల‌క్ష‌ల 81వేల మంది డ్ర‌గ్స్ తీసుకున్న యువ‌తీయువ‌కుల మీద ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన‌ అనంత‌రం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

    2008 నుంచి 2019 వ‌ర‌కు ఈ సంస్థ నిశితంగా ఈ అంశంపై ప‌రిశోధ‌న‌లు చేసింది. ఇక మ‌గ‌వాళ్ళ కంటే మ‌హిళ‌లే 50 శాతం అధికంగా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డతార‌ని పేర్కొంది. లిక్క‌ర్ ద్వారాగానీ, స్మోకింగ్ ద్వారాగానీ ఎక్కువ‌గా డ్ర‌గ్స్ తీసుకుంటుంటారు. డ్ర‌గ్స్ తీసుకున్న వారి నాడీవ్య‌వ‌స్థ నియంత్ర‌ణ కోల్పోవ‌డం, మెద‌డులో క‌లిగే క‌లిగే ర‌సాయ‌నిక చ‌ర్య‌లు వ‌గైనా, వారిలో సుసైడ్ ఆలోచ‌న‌ల‌ను విప‌రీతంగా ప్రేరేపిస్తాయ‌ట‌. ఈ కార‌ణంగానే డ్ర‌గ్స్ తీసుకునేవారు, డ్ర‌గ్స్ కి బానిసైన వారు… సుసైడ్ చేసుకోవాల‌నుకుంటార‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..