అల్లు అర్జున్ పై దిల్ కామెంట్ తో గరం , గరం..

  0
  530

  స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి , అల్లుఅర్జున్ కి మధ్య విభేదాలున్నాయా..? ఇండస్ట్రీలో గుప్పుమంటున్న ఈ వార్తలో నిజముందని దిల్ రాజు ప్రెస్ మీట్ లో తేలిపోయింది. ఐకాన్ ..అనే ఒక సినిమాను దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. దానిలో అల్లుఅర్జున్ హీరో అనే అందరూ భావించారు. దిల్ రాజు కూడా గతంలో అదే చెప్పాడు. ఇటీవల అల్లు అర్జున్ కు ఐకాన్ అనే టైటిల్ పెట్టారు. అభిమానులు కూడా అలాగే పిలుస్తున్నారు. అయితే ఐకాన్ అనే టైటిల్ ను , ఆయనే స్వయంగా పెట్టుకున్నాడేమో , నాకు తెలియదు అంటూ దిల్ రాజు , అల్లు అర్జున్ ని అవమానించే రీతిలో కామెంట్ చేశాడు. ఇదే ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఐకాన్ లో, పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటాడేమో అన్నట్టుకూడా మాట్లాడారు. వకీల్ సాబ్ తర్వాత , తమకు పవన్ దగ్గరకు నేరుగా ఎంట్రీ ఉందని , మధ్యవర్తులు అవసరంలేదన్నట్టు మాట్లాడారు..

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.