కరోనా చికిత్సలో ఆ రెండు ట్యాబ్లెట్లు వద్దు..

  0
  47

  మొదట్లో అజిత్రో మైసిన్ కరోనాకు దివ్యౌషధం అన్నారు. ఆ తర్వాత వద్దన్నారు.
  క్రిటికల్ స్టేజ్ లో ఉన్నవారికి ప్లాస్మా థెరపీ అత్యవసరం అన్నారు, ఆ తర్వాత వద్దన్నారు.
  రెమిడిసెవిర్ ప్రాణం కాపాడుతుందని చెప్పారు, ఆ తర్వాత అవసరం లేదని WHO తేల్చి చెప్పింది.
  ఇలా.. ఇప్పటి వరకు చాలామందుల్ని కొవిడ్ ప్రొటోకాల్ నుంచి తొలగిస్తూ వస్తున్నారు.
  ఐవర్ మెక్టిన్, డాక్సీ సైక్లిన్.. ఔట్
  తాజాగా క‌రోనా చికిత్స‌లో ప‌లు కీల‌క‌మైన మార్పులు చేసింది కేంద్ర ఆరోగ్య‌శాఖకు చెందిన డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ హెల్త్ స‌ర్వీసెస్ (డీజీహెచ్ఎస్‌). ల‌క్ష‌ణాలు లేని వాళ్ల‌కు అస‌లు ఏ మందులూ వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న వాళ్లు యాంటీపైరెటిక్‌, యాంటీట్యూసివ్ మందులు మాత్ర‌మే వాడాల‌ని చెప్పింది. ఇన్నాళ్లూ ల‌క్ష‌ణాలు లేని, స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న వాళ్ల‌కు కొవిడ్ చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఐవ‌ర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్‌, జింక్‌, మ‌ల్టీ విట‌మిన్ల వంటి ట్యాబ్లెట్లు అవ‌స‌రం లేదని తేల్చి చెప్పింది. జ్వ‌రం కోసం యాంటీపైరెటిక్‌, జ‌లుబు కోసం యాంటీట్యూసివ్ మందులు మాత్రం వాడితే చాల‌ని తెలిపింది.

  అత్యవసరమైతేనే సీటీస్కాన్..
  అవ‌న‌సరంగా పేషెంట్ల‌కు సీటీ స్కాన్లు చేయించొద్ద‌ని కూడా డాక్ట‌ర్ల‌కు సూచించింది. కొవిడ్‌ను అడ్డుకోవ‌డానికి మాస్కులు ధ‌రించ‌డం, చేతులు శుభ్రంగా ఉంచుకోవ‌డం, భౌతిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ల‌క్ష‌ణాలు లేని వాళ్ల‌కు అస‌లు ఎలాంటి మందులు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీర్ఘ‌కాలిక వ్యాధులతో బాధ‌ప‌డుతున్న వాళ్ల‌యితే మాత్రం తాము వాడుతున్న మందుల‌ను కొన‌సాగించాల‌ని సూచించింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు జ్వ‌రం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, ఆక్సిజ‌న్ సాచురేషన్ వంటివి చెక్ చేసుకుంటూ ఉండాల‌ని సూచించింది. ద‌గ్గు ఉంటే ఐదు రోజుల పాటు ఆవిరి కోసం బుడెసొనైడ్ 800 ఎంసీజీ డోసు రోజుకు రెండుసార్లు వాడాల‌ని చెప్పింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..