ఏపీలో రేపట్నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు..

  0
  2003

  ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు రేపటినుంచి అమలులోకి రాబోతోంది. అదే సమయంలో సడలింపు సమయాల్లో మార్పులు కూడా రేపట్నుంచే అమలవుతాయి. ఈరోజు వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉంది. రేపట్నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కర్ఫ్యూ కఠినంగా అమలవుతుంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కర్ఫ్యూ వేళల్లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొత్త నిబంధనలు జూన్‌ 20 వరకు అమలులో ఉంటాయి.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..