ఆత్మహత్యను ఆపాల్సింది పోయి వీడియో తీశాడు.

  0
  14906

  నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘోరం జరిగింది. భార్య క్షణికావేశంలో ఉరేసుకోడానికి ప్రయత్నిస్తుంటే భర్త దగ్గరుండి ఆ ఘటనను వీడియో తీశాడు. అంతే కాదు, ఆమెను ఉరేసుకోమంటూ ప్రోత్సహించాడు కూడా. ఊపిరాడక భార్య గిలగిల్లాడుతుంటే కాపాడాల్సింది పోయి తమాషా చూశాడు. చివరకు ఆమె ప్రాణం పోయిన తర్వాత లబోదిబోమన్నాడు.


  నెల్లూరు జిల్లా ఆత్మకూరు మెప్మా లో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న కొండమ్మ ఆత్మహత్య చేసుకుంది. కొండమ్మ ఆత్మహత్యను ప్రోత్సహిస్తూ దగ్గరుండి వీడియో చిత్రీకరించాడు భర్త పెంచలయ్య. భార్యపై అనుమానంతో తరచూ వేధిస్తుండటంతో కొండమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆ వీడియోను భార్య తమ్ముడికి బంధువులకు పంపి కొండమ్మ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పాడు భర్త పెంచలయ్య. బంధువుల సమాచారంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అప్పటికే కొండమ్మ చనిపోవడంతో భర్త పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.