కృత్రిమ కిడ్నీలు వచ్చేస్తున్నాయి..

    0
    94

    మరో రెండేళ్లలో కృత్రిమ గుండె అందుబాటులోకి రానున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ కృత్రిమ కిడ్నీల తయారీలో శాస్త్రవేత్తలు ఒకడుగు ముందుకేశారు. శరీరంలో అమర్చే బయో కిడ్నీల సృష్టి ఓ కొలిక్కి వచ్చింది. ఇది ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఓ స్మార్ట్ ఫోన్ సైజ్ లో ఉండే ఈ కృత్రిమ కిడ్నీ డయాలసిస్, రక్త ప్రసరణ, కిడ్నీ పనితీరు.. ఇలాంటివన్నీ ఒక రోగికి అమర్చి, అధ్యయనం చేశారు. కృత్రిమ కిడ్నీలో హీమో ఫిల్టర్ మరియు బయో రియాక్టర్ పనితీరు చాలా ముఖ్యమైనది. ఇవి రెండూ విజయవంతంగా పనిచేస్తున్నాయని నిర్థారించారు.

    ముందు ప్రయోగ శాలలో వీటిని పరిశీలించిన తర్వాత అవసరమైన ఒక రోగికి, అతడి బంధువుల అనుమతి మేరకు అమర్చి క్లినికల్ ట్రయల్స్ కి సిద్ధమయ్యారు. కిడ్నీలోని హీమో ఫిల్టర్, రక్తంలో వ్యర్థాలను, రసాయనిక పదార్థాలను వేరు చేసి బయటకు పంపుతుంది. బయో రియాక్టర్ కిడ్నీలోని ఇతర కార్యకలాపాలను నిర్దేశించి అవి సక్రమంగా జరిగేట్టు చూస్తుంది. రక్తంలో ఎలక్ట్రో లైట్స్ బ్యాలెన్స్ తప్పకుండా మెయింటెన్ చేస్తుంది.

    కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను, అనవసరమైన ద్రవ పదార్థాలను వేరు చేసి మూత్రం ద్వారా బయటకు పంపే విధానాన్ని కృత్రిమ కిడ్నీలో కూడా పరిశీలించి సంతృప్తి చెందారు. ఈ కృత్రిమ కిడ్నీని బ్యాటరీల సాయంతో కాకుండా రక్తపీడనం ద్వారానే పనిచేసేట్టు చూస్తున్నారు. రక్తం పలుచబడే, లేదా వ్యాధి నిరోధకత పెంచే మందులతో పనిలేకుండానే ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీలను ప్రయోగించారు.

    కృత్రిమ కిడ్నీలు అమర్చుకున్నవారు డయాలసిస్ స్టేజ్ కంటే బాగానే ఉండగలరని, పూర్తిగా కిడ్నీలు చెడిపోయి అవసాన దశకు చేరుకున్నవారికి ఈ కృత్రిమ కిడ్నీలు ఆశాకిరణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా కిడ్నీలు చెడిపోయిన వారు క్రమం తప్పకుండా డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ కృత్రిమ కిడ్నీలు తగ్గించాయి. కిడ్నీలు చెడిపోయినవారికి కిడ్నీలు దానం చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో కృత్రిమ కిడ్నీల అవసరాన్ని గుర్తించి శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు చేసి కృత్రిమ కిడ్నీని సృష్టించి నవశకానికి నాంది పలకబోతున్నారు. మరి కొద్ది సంవత్సరాన్నో ఈ కృత్రిమ కిడ్నీ మనుషుల్లో అమర్చడానికి సిద్ధమవుతున్నారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.