కవలలు చనిపోయిన రోజే , మళ్ళీ కవలలు పుట్టారు..

  0
  137

  విధి విలాసం ఊహించ‌డం ఎవ‌రికి త‌రం. విధి ఆడిన నాట‌కంలో రెండేళ్ళ క్రితం ఆ త‌ల్లిదండ్రులు ఓ ప‌డ‌వ ప్ర‌మాదంలో త‌మ ఇద్ద‌రు క‌వ‌ల ఆడ‌పిల్ల‌ల‌ను పోగొట్టుకున్నారు. ఒకేరోజు ఇద్ద‌రు కూతుళ్లు చ‌నిపోవ‌డంతో.. దేవుడిని నిందించుకుంటూ క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. అయితే స‌రిగ్గా రెండేళ్ళ త‌ర్వాత అంటే ఈ ఏడాది, చ‌నిపోయిన తేదీనే.. ఇద్ద‌రు క‌వ‌ల ఆడ‌శిశువులు జ‌న్మించ‌డం.. నిజంగా అద్భుతం.

  వివ‌రాల్లోకి వెళితే…
  తూర్పుగోదావ‌రి జిల్లా ఆరిలోవ ప్రాంతానికి చెందిన అప్ప‌ల‌రాజు, భాగ్య‌ల‌క్ష్మీ దంప‌తులు, వారికి ఇద్ద‌రు క‌వ‌ల కుమార్తెలు. 2019 సెప్టెంబర్‌ 15న బంధువుల‌తో క‌లిసి రాజమండ్రి నుంచి భద్రాచలానికి బోటులో బయలుదేరి వెళ్ళారు. అయితే బోటు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో భార్య‌భ‌ర్త‌లు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డినా, ఇద్ద‌రు కుమార్తెలు మాత్రం గోదార‌మ్మ ఒడిలో క‌లిసిపోయారు. దీంతో ఆ దంపతులు గర్భశోకంతో తల్లడిల్లిపోయారు. ఇలా రెండేళ్ళు గ‌డిచిపోయాయి.

  ఆ దంపతుల మీద దేవుడికి ద‌య క‌లిగిందో ఏమో.. రెండేళ్ళ త‌ర్వాత, అంటే ఈ ఏడాది స‌రిగ్గా సెప్టెంబ‌ర్ 15వ తేదీన భాగ్య‌ల‌క్ష్మీ ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. విచిత్రంగా ఆ ఇద్ద‌రూ ఆడ‌పిల్ల‌లే కావ‌డం విశేషం. దీంతో ఆ కుటుంబంలో ఆనందం మిన్నంటింది. ఇది దేవుడు ఇచ్చిన వ‌ర‌మ‌ని ఆ కుటుంబం సంబ‌ర‌ప‌డిపోతోంది. విధి విచిత్ర‌మైన‌ది అంటే ఇదేనేమో.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.