లక్షలు లంచం ఇస్తే క్రికెట్ సెలెక్షన్స్..

    0
    343

    క్రికెట్ సెలక్షన్లలో భారీ స్థాయి అవినీతి బయటపడింది. ఔత్సహిక క్రికెటర్లకు స్టేట్ లెవెల్ నుంచి ఐపీఎల్ వరకు అవకాశాలు కల్పిస్తామని లక్షలు దండుకున్న సెలెక్టర్లు , క్రికెట్ అసోసియేషన్ లు ఇప్పుడు పోలీసు వలలో చిక్కాయి, గురుగావ్ పోలీసులు తీగ లాగితే డొంక కదిలినట్టు అనేకమంది పెద్దలు బండారం ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది. ఇప్పటివరకు కోచ్ కులబీర్ రావత్ ను అరెస్ట్ చేశారు. అశుతోష్ , అతడి చెల్లెలు చిత్ర కూడా అరెస్ట్ అయ్యారు. మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు. సిక్కిం క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ బికాష్ ప్రధాన్ కూడా ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. యుపి, ఉత్తరాఖండ్ , అరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లు , సెలెక్టర్లు , అంతా కలిసి కోట్ల రూపాయల్లో వసూలుచేశారని తెలుస్తోంది. స్టేట్ లెవెల్ టీమ్ లకు 35 లక్షల నుంచి కలెక్ట్ చేసారని చెబుతున్నారు. మొత్తం మీద ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు , ప్లేయర్ల ఫిర్యాదులు , మొదట చిక్కిన కోచ్ ఇచ్చిన సమాచారంతో అందరినీ త్వరలో అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.