సమంతను డబ్బు సంపాదించే మిషన్ లా చూసారు..

  0
  1115

  బ్యూటిఫుల్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన నాగ చైతన్య, సమంతలు విడిపోవడం చిత్ర‌సీమంలోనే కాదు దేశ‌వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ బ్రేక‌ప్‌, డ్రైవ‌ర్స్ వ్య‌వ‌హారంపై చాలామంది సెల‌బ్రిటీలు ర‌క‌ర‌కాలుగా స్పందించారు. తాజాగా సినీన‌టి మాధ‌వీల‌త కూడా ఫేస్‌ బుక్‌ లైవ్‌లోకి వచ్చి చై-సామ్‌ విడాకులపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. స‌మంతపై ఓ రేంజ్ లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ఎట్ ద సేమ్ టైం అక్కినేని ఫ్యామిలీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది.

  సమంత ప్రత్యూష ఫౌండేషన్ సహా ఎన్నో ఎన్జీవోలతో కలిసి చిన్న పిల్లలకు ఎన్నో ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడిందని మాధ‌వీల‌త చెప్పుకొచ్చింది. సమంత డబ్బు మనిషి కాదని సినిమాలు చేశాక వాటి ద్వారా వచ్చిన డబ్బు కూడా ఏం చేయాలో ఆమెకు తెలియదని చెప్పింది. ధరించే దుస్తులను బట్టి అమ్మాయిల క్యారెక్టర్‌ను డిసైడ్‌ చెయ్యొద్దని మాధవీలత విజ్ఞప్తి చేశారు. గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు కోసం ఆమెను వాడుకున్నాడని, ఆ విషయం తెలిసి సమంత దూరం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పెళ్లయిన తర్వాత సమంతలో చాలా పరివర్తన వచ్చిందన్నారు.

  తనకు 30 ఏళ్ల వయసు రాగానే ఒక బిడ్డకు తల్లి కావాలనే విషయాన్ని గతంలో ప్రదీప్ యాంకర్ గా ఉన్న ఒక షోలో వెల్లడించిందని ఆమె పేర్కొంది. దానికి కారణం కూడా ఆమె వెల్లడించింది. అయితే ఆమె గర్భవతి అయితే ఆమెకు వచ్చే సినిమా అవకాశాలు తగ్గిపోతాయని భావించి ఆమె మనస్సు మార్చి తల్లి కావాలనే ఆమె ఆశలు చంపేశారని ప‌రోక్షంగా అక్కినేని ఫ్యామిలీపై మాధవీ లతా ఆరోప‌ణ‌లు చేసింది.
  ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి దూరమైతే బాధగానే ఉంటుంది కానీ ఎంత బాధ అనుభవించి ఉంటే పెళ్లి చేసుకున్న వాడికి దూరం అవ్వాలని అనుకుంటుందో ఆలోచించాలని చెప్పుకొచ్చింది.

  కోట్లు సంపాదించే స‌మ‌త‌కు వేల రూపాయ‌లు పాకెట్ మ‌నీ ఇచ్చేవార‌ని విమ‌ర్శించింది. ఇదంతా ఆమె స‌న్నిహితులు త‌న‌కు చెప్పార‌ని, అందుకే తాను ఇప్పుడు ఓపెన్ గా చెబుతున్నాన‌ని తెలిపింది. చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పుడైనా సహాయం చేశారా అని అందరూ అడుగుతారు కానీ తండ్రుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న నాగార్జున, వెంకటేష్ చేశారా అని ఎవరు ఎందుకు అడగరు అని మాధవీలత ప్రశ్నించింది. ప్రస్తుతం మాధవి లత కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.