సెల్ ఫోన్ స్క్రీన్ పైనే కరోనా టెస్ట్..

  0
  2885

  కరోనా పరీక్షల నిర్థారణ కోసం ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లకు ఇకనుంచి పోనవసరం లేదేమో. మొబైల్ ఫోన్లు ఉన్నవారు మొబైల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడేవారు, ఆ మొబైల్ ఫోన్ ఇస్తే, క్షణాల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేసేస్తారు. మొబైలా స్క్రీన్ మీద ఉండే కొవిడ్ వైరస్ ను పరీక్షించేం సాధనాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

  స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ల నుంచి, సేకరించిన నమూనాలతో ఆ స్మార్ట్ ఫోన్లు వాడే వ్యక్తికి కరోనా ఉందో లేదో చెప్పేస్తున్నారు. దాదాపు 97శాతం కచ్చితత్వంతో ఈ టెస్ట్ లు నిర్థారణ అయ్యాయి. ఈ కొత్తరకం పరీక్షలను ఫోన్ స్క్రీన్ టెస్టింగ్ (POST) అంటారు. కరోనా వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో 81నుంచి 100శాతం వైరస్ స్క్రీన్ పై కచ్చితంగా కనిపిస్తుందని తెలిపారు.

  దీన్ని క్లినికల్ టెస్ట్ అనేదానికంటే, ఎన్విరాన్ మెంటల్ టెస్ట్ అనడమే సమంజసం అని, ఎటువంటి భయం లేకుండా తక్కువ ఖర్చుతో ఈ పరీక్ష చేయొచ్చని అన్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద వైరస్ నిర్థారణ అయితే ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ కూడా చేయించుకోవచ్చని తెలిపారు. ఒక నిముషం కంటే తక్కువ సమయలో ఈ పరీక్ష చేయొచ్చని చెప్పారు. దీన్ని కనుగొనే స్టిక్ వాడేందుకు వైద్య పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు అవసరం లేదని ఈ లైఫ్ జర్నల్ లో ప్రచురించిన వ్యాసంలో పేర్కొన్నారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..