ఆనందయ్య ఊరిలో కరోనా విలయం..

    0
    7874

    ఆనందయ్య మందుతో ఒక్కసారిగా దేశంలో ప్రచారానికి వచ్చిన కృష్ణపట్నం గ్రామంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 72మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారించగా, మరికొందమందికి ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. గ్రామం మొత్తం ఇప్పుడు కరోనా టెస్ట్ లు చేయిస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీ ముందు వరకు ఆ గ్రామంలో ఎవరికీ కరోనా రాలేదని చెప్పేవారు. ఆనందయ్య మందు పంపిణీ మొదలైన తర్వాత గ్రామానికి వందలు, వేలుగా ప్రజల రాకపోకలు మొదలయ్యాయి. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులు కూడా మందుకోసం రావడం మొదలు పెట్టారు. ఈ పరిణామంలో మందు పంపిణీలో తొక్కిసలాట జరగడం, ఆ తర్వాత ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేయడం జరిగింది. ఆ మందు నాణ్యతపై వివిధ ఆయుర్వేద పరిశోధనా సంస్థలు పరిశీలన మొదలు పెట్టి మందు బాగా పనిచేస్తుందని కూడా చెప్పారు. ఆనందయ్య మందు పంపిణీ నిలివేసినా గ్రామానికి రాకపోకలు తగ్గలేదు. ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు ఆగ్రామాన్ని సందర్శిస్తూనే ఉన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, నిజ నిర్థారణ కమిటీల పేరుతో ఆ గ్రామానికి పోతూనే ఉన్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్నా రాకపోకలు ఆగలేదు. ఈ కారణంగా కూడా గ్రామంలో కరోనా వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు కరోనా సోకని గ్రామానికి, కరోనా సోకింది.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..