ఆచేతికి కొవాక్సిన్, ఈ చేతికి కొవిషీల్డ్..

    0
    3101

    ఫస్ట్ డోస్ కొవాక్సిన్ తీసుకుంటే రెండో డోసు కూడా అదే తీసుకోవాలి, కొవిషీల్డ్ వేయించుకుంటే.. రెండోసారి అదే టీకా తీసుకోవాలి. ఇదీ ప్రస్తుతం భారత దేశంలో అమలవుతున్న నిబంధనలు. కానీ బీహార్ లోని అవాన్ పూర్ కి చెందిన సునీలాదేవి అనే మహిళ అమాయకంగా రెండు టీకాలు తీసుకున్నారు. అది కూడా కేవలం 5 నిముషాల వ్యవధలో. తెలియక తప్పుచేసినా ఇప్పుడామె క్షేమంగానే ఉండటం విశేషం.
    65 సంవత్సరాల సునీలాదేవి టీకా ఫస్ట్ డోస్ తీసుకోడానికి ఆస్పత్రికి వెళ్లారు. ఓ చేయికి కొవాక్సిన్ తీసుకున్నారు. కాసేపు పక్కన కూర్చోండి అని వైద్యులు చెప్పడంతో.. ఆమె విశ్రాంతి తీసుకుంటూ.. వెంటనే మరో లైన్ లోకి వెళ్లారు. అక్కడ ఆమె కొవిషీల్డ్ టీకా మరో చేతికి వేయించుకుంది. ఒకేసారి రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన టీకాలు వేయించుకోవడంతో ఆమె డీహైడ్రేట్ అయింది. నీరసం వచ్చి పడిపోవడంతో డాక్టర్లు సెలైన్ ఎక్కించారు. 24గంటలు అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతానికి ఆమెకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలిపారు.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..