తన చితికి తానే నిప్పంటించుకున్నాడు..

  0
  996

  నా అన్నవారు ఎవరూ లేక, ఉన్న ఆదరుకూడా ప్రభుత్వం తొలగించడంతో చివరకు విసిగి వేసారి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆ క్రమంలో అతను చేసిన పని తీవ్ర విషాదానికి దగురి చేసేలా ఉంది. తన ఇంటిలోనే చితి పేర్చుకుని ఆ చితిపై కూర్చుని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడికక్కడే కాలి బూడిద అయ్యాడు. ఈ విషాద ఘటన తెలంగాణ సిద్దిపేట జిల్లా వేములగాట్ లో జరిగింది. తొగుట మండలం వేములగాట్‌ కు చెందిన మల్లారెడ్డి భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా కాలం వెల్లదీస్తున్నాడు. కొన్ని నెలల క్రితం మల్లారెడ్డి ఇంటిని, మల్లన్న సాగర్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
  ఈ నేపథ్యంలో మృతుడు డబుల్‌ బెడ్‌ రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇంటిని మంజూరు చేసి ఒంటరి వాడన్న కారణంతో వెనక్కు తీసుకున్నారు. ఉన్న ఇల్లు పోయింది, ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా వెనక్కి తీసుకోవడంతో మనస్తాపానికి గురైన మల్లారెడ్డి ఇంట్లోనే చితి పేర్చుకుని తగలబెట్టుకుని చనిపోయాడు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..