కిరాతక తల్లికి , ప్రియుడికి ఉరి శిక్ష..

  0
  4809

  అక్రమ సంబంధం కోసం మూడున్నరేళ్ల కూతుర్ని దారుణంగా హింసించి చంపేసిన తల్లికి, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష విధిస్తూ పశ్చిమబెంగాల్ లోని పురూలియా కోర్టు తీర్పునిచ్చింది. మాతృత్వానికే మచ్చగా మిగిలే ఈ కేసు ఆ రాష్ట్రంలో సంచలనం కలిగించింది. మంగళ అనే మహిళ, సనాతన్ ఠాకూర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఆమె తిరుగుళ్లు భరించలేక భర్త వెళ్లిపోయాడు. దీంతో ప్రియుడితో ఉన్న మంగళ బిడ్డను వదిలించుకోవాలని పథకం వేసింది.

  ఇందుకు ప్రియుడు కూడా ఆమెను ఒత్తిడి చేశాడు. దీంతో మంగళ తన బిడ్డకు, గుండెల్లోనూ, కడుపులోనూ ఏడు సూదులు గుచ్చింది. నిరంతరం హింసించేది. తీవ్రమైన జ్వరం వస్తున్నా ఆస్పత్రికి తీసుకెళ్లేది కాదు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. మంగళ ఇంటికెళ్లి బిడ్డను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకే బిడ్డ చనిపోయింది. దీంతో ఆమె, ఆమె ప్రియుడిపై హత్యకేసు నమోదు చేసి జైలులో పెట్టారు.

  ఈ కేసుని విచారించిన పురూలియా కోర్టు వారిద్దరికీ మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక తల్లిగా, మహిళగా బిడ్డను ఇంత కిరాతకంగా చంపిన మంగళకు ఈ సమాజంలో బతికే హక్కు లేదని తీర్పులో స్పష్టం చేసింది. ఈ దారుణ హత్యాకాండలో తల్లిదే ప్రధాన పాత్ర అని కూడా చెప్పింది. తల్లిఒడి బిడ్డకు గుడిలాంటిదని, అటువంటి పవిత్రమైన తల్లిఒడిని బిడ్డను చంపేందుకు ఉపయోగించిందని తెలియజేసింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.